‘‘పెథాయ్’’ బీభత్సం: ఏపీలో రైళ్ల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు

By sivanagaprasad KodatiFirst Published Dec 17, 2018, 10:25 AM IST
Highlights

పెథాయ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. దీని ప్రభావం రవాణా సౌకర్యాలపైనా పడింది. తుఫాను కారణంగా ట్రాకులు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు సోమవారా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

పెథాయ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. దీని ప్రభావం రవాణా సౌకర్యాలపైనా పడింది. తుఫాను కారణంగా ట్రాకులు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు సోమవారా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అంతేకాకుండా తుఫాన్ దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. పట్టాల వెంబడి నిరంతరాయంగా గస్తీని కొనాసాగించాలని.. విజయవాడ, గుంటూరుల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

రద్దయిన రైళ్ల వివరాలు:
1.విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
2.రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్‌
3.విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్‌
4. కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్‌
5. విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
6. తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
7.  గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్‌
8. తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్‌
9.  విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
10తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
11. విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
12. విజయవాడ-కాకినాడ పోర్ట్‌, మెము ప్యాసింజర్‌
13. రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
14.  భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్‌
15.  రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
16.  భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్‌
17. నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్‌
18. భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్‌
19.  రాజమండ్రి-నర్సాపూర్‌, డెము ప్యాసింజర్‌
20.  నర్సాపూర్‌-గుంటూరు, డెము ప్యాసింజర్‌
21. గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్‌
22. విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్‌

 

పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

ఏపీలో ‘‘పెథాయ్’’ విలయ తాండవం

పెథాయ్ తుఫాన్: తెలంగాణ‌పై ఎఫెక్ట్

పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

దిశ మార్చుకొంటున్న పెథాయ్: భారీ వర్షాలు

ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

click me!