ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా..

First Published 3, Sep 2018, 1:51 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో లవర్స్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్నాయి.తన ప్రియురాలితో  సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ యువకుడు  తన సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో లవర్స్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్నాయి.తన ప్రియురాలితో  సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ యువకుడు  తన సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలానికి చెందిన  ఓ యువకుడు  శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీలో  చదువుతున్న  యువతిని ప్రేమిస్తున్నాడు.  వీరిద్దరూ  తరచూ కలుసుకొనేవారు.

ఒకరోజు తామిద్దరం సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఆ యువకుడు  తన సెల్‌ఫోన్‌లో  చిత్రీకరించాడు. అయితే  ఇటీవల కాలంలో ఆ యువకుడి ఫోన్‌ ను స్నేహితుడు చూశాడు.  ఈ ఫోన్ లో  తన లవర్ తో ఆ యువకుడు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను గుర్తించాడు.

వెంటనే  ఆ దృశ్యాలను  తన ఫోన్‌లోని డౌన్ లోడ్ చేసుకొన్నాడు.ఈ దృశ్యాలను  ఇతరులకు కూడ షేర్ చేశాడు. దీంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై బాధితులు  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ఈ వార్తలు చదవండి

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

ఆ అవసరం లేదు: భార్య ఆరోపణలపై టెక్కీ

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

Last Updated 9, Sep 2018, 2:04 PM IST