గుంటూరు గ్యాంగ్ రేప్... తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు బాధిత యువతి, ఐడెంటిఫికేషన్ పరేడ్?(వీడియో)

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 3:47 PM IST
Highlights

తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో లైగింకదాడికి గురయిన యువతి పూర్తిగా కోలుకోవడంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. 

తాడేపల్లి: గుంటూరులో కృష్ణా నది తీరాల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దుండగుల చేతిలో లైగింకదాడికి గురయిన యువతి పూర్తిగా కోలుకోవడంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా అత్యాచార బాధితురాలిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు. ఇప్పటికే పోలిసుల అదుపులో ఉన్న అనుమానితులను గుర్తించేందుకు ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ అత్యాచార, దోపిడీకి సంబంధించి పోలీసుల అదుపులో సుమారు 22 మంది అనుమానితులు వున్నారు. వీరిలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవరెవరో గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. 

తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పోలిస్ ఉన్నతాధికారి బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నీరు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ రహస్యంగా బాధిత యువతిని పోలీస్ స్టేషనకు తీసుకువచ్చారు పోలీస్ అధికారులు. 

వీడియో

ఇటీవల విహారానికి వెళ్లిన ప్రేమ జంటపై తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద దుండగులు దాడి చేసిన విషయం తెలిసింది. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఈ కేసులో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. బాధితురాలితో పాటు ఆమెతో ఉన్న యువకుడి సెల్ పోన్లు నిందితులు లాక్కున్నారు. వాటిని సీతానగరంలో తాకట్టు పెట్టారు. ఫోన్లు తాకట్టు పెట్టుకున్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

గ్యాంగ్ రేప్ కేసులో వెంకటేష్ తో పాటు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని కోసం పోలీసులు వేటాడుతున్నారు.

click me!