జనసేనలో కొత్తవారి సందడి... పవన్‌పై ఫ్యాన్స్ అలక..?

First Published Jun 30, 2018, 12:46 PM IST
Highlights

జనసేనలో కొత్తవారి సందడి... పవన్‌పై ఫ్యాన్స్ అలక..?

పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమని పార్టీ పెట్టి.. ఏం చేయాలో..ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రజా పోరాట యాత్ర అని మొదలుపెట్టాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అది కరెక్ట్‌గా చేస్తూ.. జనంలో కాస్త పాజిటివ్ వేవ్స్ వస్తున్న సందర్భంలో మళ్లీ రంజాన్ హాలీడేస్ ఇచ్చి ఇప్పటికీ అతి గతీ లేకుండా పోయాడు పవర్‌స్టార్. కంటికి సర్జరీ అని.. రేపో మాపో మళ్లీ యాత్ర మొదలుపెడతానని చెబుతూ కార్యకర్తలను, అభిమానులను సందిగ్థంలో పడేసిన పవన్ వైఖరి పట్ల ఫ్యాన్స్‌కు నానాటికి నమ్మకం పోతోంది. పోనీలే సరిపెట్టుకుందాం అనుకుంటున్న సమయంలో అన్ అఫీషియల్‌ పార్టీ లీడర్స్‌గా జెండా మోస్తున్న తమను కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చి చేరుతున్న

తలకు పవన్ కల్యాణ్ అమిత ప్రాధాన్యత ఇవ్వడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో తెలియకపోయినా.. అసలు పార్టీ ఉంటుందో..? ఉండదో ఉండకపోయినా..? కేవలం అభిమాన కథానాయకుడి కోసం ఫ్యాన్స్ జెండా మోస్తున్నారు. అలాంటి వారు కొత్తగా వచ్చిన నేతల వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

పవన్‌ను దేవుడిగా చూసుకునే అభిమానులను నేతలు దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. ఎన్నో ఏళ్లుగా ఆయన్ను అంటి పెట్టుకుని ఉన్నామని.. మీరు కొత్తగా వచ్చారని.. మా కష్టాన్ని వూరికే పోనిస్తారా అంటూ వారితో గొడవకు దిగుతున్నారు.. ఇది అధినేత వరకు వెళ్ళిన ఘటనలు లేకపోలేదు.. గతంలో శ్రీకాకుళం జిల్లాలో బస చేసిన కళ్యాణ మండపం ఎదుట జనసైనికులు ధర్నాకు దిగారు.. ఇప్పటికే శ్రీరెడ్డి, మీడియాపై తిరుగుబాటు వ్యవహారాలతో పవన్ ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యింది.

అయినప్పటికీ అభిమానులు ఆయన్ను వదల్లేదు.. కానీ.. ఇరువర్గాలకు సమప్రాధాన్యం ఇవ్వడంలో అధినేత విఫలమవ్వడం.. పార్టీకోసం, పవన్ కోసం అన్ని వదులుకుని పనిచేస్తున్న అభిమానుల్లో తిరుగుబాటు ధోరణిని తీసుకువస్తుందని విశ్లేషకులు అంటున్నారు... ఇకనైనా కొత్తవారికి, పాత వారికి సమప్రాధాన్యం ఇవ్వకపోతే... జనసేనాని నష్టపోక తప్పదని ఎనలిస్టులు సూచిస్తున్నారు.  

click me!