ఒక్కటి నిరూపించండి, ఉరేసుకుంటా: చంద్రబాబుకు తోట త్రిమూర్తులు సవాల్

By Nagaraju penumalaFirst Published Sep 13, 2019, 6:33 PM IST
Highlights

చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో తాను 17 సంవత్సరాలు ఉన్నానని, ఒక్క వ్యక్తిగత పని చేయించున్నట్టు చంద్రబాబు చూపించగలరా అంటూ సవాల్ విసిరారు. 

కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు పంచ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో కార్యకర్తలతో భేటీ అయిన తోట త్రిమూర్తులు చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాకినాడలో ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. చంద్రబాబు సమీక్షా సమావేశానికి తోట త్రిమూర్తులు గైర్హాజరవ్వడం పలువురు పార్టీకి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

అనేక మంది పార్టీలోకి వచ్చి సొంతపనులు చేయించుకుని వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు వెళ్లినా తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందని కార్యకర్తలు తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో తాను 17 సంవత్సరాలు ఉన్నానని, ఒక్క వ్యక్తిగత పని చేయించున్నట్టు చంద్రబాబు చూపించగలరా అంటూ సవాల్ విసిరారు. 

తాను వ్యక్తిగత పనులు చేయించుకున్నట్లు నిరూపిస్తే కార్యకర్తల సమక్షంలోనే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 18న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబుకు షాక్: తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్‌బై

జ్యోతుల నెహ్రు బుజ్జగింపులు వృధా: వైసీపీలోకి తోట త్రిమూర్తులు

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్: మురళీమోహన్ కోడలు కూడా.....

టీడీపీకి మరో ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు...?

బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి: తేల్చేసిన తోట త్రిమూర్తులు

చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో ప్రజావేదిక చిచ్చు

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

 

click me!