జగన్ విజన్ ,ఆలోచన సూపర్: ప్రశంసించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్

By Nagaraju penumalaFirst Published Sep 13, 2019, 5:49 PM IST
Highlights

జగన్‌ ఆలోచన విధానం, అంకితభావం, విజన్‌ తనను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తమ వంతు సహయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. సచివాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన రాజీవ్ కుమార్ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు కనబరిచారంటూ కితాబిచ్చారు. 

సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు రాజీవ్ కుమార్ కు ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, కార్యక్రమాలను వైయస్ జగన్ వివరించారు. 

రాష్ట్రంలో నిరక్షరాస్యతను అధిగమించడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని వైయస్ జగన్ వివరించారు. జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని హామీ ఇచ్చారు.  

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌, ప్రణాళికలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మెరుగైన పనితీరును కనబర్చారని కొనియాడారు. 

జగన్‌ ఆలోచన విధానం, అంకితభావం, విజన్‌ తనను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తమ వంతు సహయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

రాష్టంలో నిరక్ష్యరాసత్య జాతీయ సగటు కన్నా ఎ‍క్కువగా ఉందని, మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో మానవ వనరుల వృద్ధి కోసం సగానికి పైగా కేటాయించడం అభినందనీయమన్నారు. 

గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై, పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని రాజీవ్‌ కుమార్‌ సూచించారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగును  పెంచడానికి తాము ప్రయత్నిస్తున్నామని, వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని, దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
విభజనతో ఏపీ నష్టపోయింది, ఆదుకోండి: రాజీవ్ కుమార్ ను కోరిన సీఎస్ ఎల్వీ 
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని దాన్ని అధిగమించేందుకు నీతి ఆయోగ్‌ సహకారం అవసరమని కొనియాడారు. 

పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం ఈరంగాలే రాష్ట్ర అభివృద్ధికి చోదకాలు అని చెప్పుకొచ్చారు. 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉందని కోరారు. సమగ్రాభివృద్ధితో రాష్ట్రాన్ని మోడల్‌ స్టేట్‌గా తయారు చేయాడానికి సీఎం సంకల్పించినట్లు తెలిపారు. 

కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కడప స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేసినట్లు రాజీవ్ కుమార్ కు వివరించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. 


 

click me!