పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

By telugu team  |  First Published Sep 15, 2019, 9:24 PM IST

గోదావరిలో పడవ ప్రమాదంపై బోటు యజమాని స్పందించారు. ఘటనలో ఇద్దరు డ్రైవర్లు కూడా మరణించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుడిగుండం ఉంటుందని ఆయన చెప్పారు.


రాజమండ్రి:  గోదావరిలో లాంచీ ప్రమాదానికి గురైన కచ్చులూరు దగ్గర నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుందని, ఆ ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉంటుందని, డ్రైవర్లు అదుపు చేయలేక పోయారని లాంచీ యజమాని కోడిగుడ్ల వెంకట రమణ అన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఆయన స్పందించారు. ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ మరణించినట్లు తెలిపారు.

లాంచీ కెపాసిటీ 90 మంది ప్రయాణికులు అని, అందులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నట్టు చెప్పారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువగా ఉందని దేవీ పట్నం పోలీసులు వారించినా సదరు లాంచీ డ్రైవర్లు మాట వినలేదని సమాచారం. లాంచీ డ్రైవర్లకు కాకినాడ పోర్టు లైసెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Videos

undefined

గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని అంద జేయాలని ఆదేశించారు.ఈ ఘటనలో బాధితులకు అండగా నిలవాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. 

ఆయా బోట్లు ప్రయాణానికి అనుకూలమా ? కాదా ? అని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, బోట్ల లైసెన్స్ లు పరిశీలించాలని, నిపుణులతో మార్గదర్శకాలు తయారు చేయించి తనకు నివేదించాలని అధికారులకు ఆదేశించారు.కాగా, లాంచీ మునిగిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయక చర్యల్లో సుమారు 140 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది.విశాఖ, ఏలూరు కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటి కప్పుడు సమాచారం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!