బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

By narsimha lode  |  First Published Sep 15, 2019, 9:11 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నంలో బోటు మునిగిన ఘటనలో 41 మంది ఆచూకీ గల్లంతైనట్టుగా అధికారులు ప్రకటించారు.



దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు వద్ద ఆదివారం నాడు బోటు మునిగిన ఘటనలో 41 మంది గల్లంతయ్యారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 8 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహల కోసం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు వలను ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజామువరకు  మృతదేహాలు కొట్టుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు దేవీపట్నం-కచలూరు వద్ద ఆదివారం నాడు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో 41 మంది ఆచూకీ గల్లంతైంది.24 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ఆదివారం నాడు లైట్ల వెలుగులో కూడ గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ నుండి మెరైన్ డ్రైవర్లను రప్పిస్తున్నారు. మెరైన్ డ్రైవర్లు వస్తే బోటు కింద ఎవరైనా ఉన్నారా విషయాన్ని తెలుసుకొనే అవకాశం ఉందంటున్నారు.

Latest Videos

undefined

గోదావరిలో ఇవాళ 5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గోదావరి చాలా వేగంగా ప్రవహిస్తోంది. మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

సంబంధిత వార్తలు

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!