జగన్ పై దాడి: జాతీయ నేతలతో చంద్రబాబు లంచ్ మీటింగ్

By pratap reddyFirst Published Oct 27, 2018, 1:35 PM IST
Highlights

జగన్మోహన్ రెడ్డిపై దాడి సంఘటనను ఆసరా చేసుకుని కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్రలు చేస్తోందని చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. కేంద్రం తీరుపై జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన సమాయత్తమయ్యారు.

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి నేపథ్యంలో తనకు అనుకూలంగా జాతీయ స్థాయిలో మద్దతును కూడగట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులతో కలిసి ఢిల్లీ వచ్చిన ఆయన శనివారం ఉదయం టీడీపీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. 

జగన్మోహన్ రెడ్డిపై దాడి సంఘటనను ఆసరా చేసుకుని కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్రలు చేస్తోందని చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. కేంద్రం తీరుపై జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన సమాయత్తమయ్యారు.

తన ప్రయత్నంలో భాగంగా ఆయన ఎపి భవన్ లో కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లంచ్ మీటింగులో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, యశ్వంత్ సిన్హా, శరద్ యాదవ్ పాల్గొంటారు. చంద్రబాబు ఫరూక్ అబ్దుల్లాను కూడా కలిసే అవకాశం ఉంది.

జాతీయ నేతలతో సమావేశం తర్వాత చంద్రబాబు సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు

హైదరాబాదులో జగన్ కు చికిత్స: చంద్రబాబు యూటర్న్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రా

click me!