జగన్‌కు ‘‘సీపీఎస్’’ పోటు: ఐదు నెలలైంది హామీ ఏమైంది, ఉద్యోగుల నిరసన

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 3:03 PM IST
Highlights

సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాంటూ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. 

ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సర్కార్‌ బెట్టు వీడకపోవడంతో పాటు కార్మికులు సైతం డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉద్యోగులు నిరసనకు దిగారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాంటూ ఉద్యోగులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. అటు విజయవాడ ధర్నా చౌక్‌లోనూ ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా సీపీఎస్ విధానంపై జగన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. 

Also Read:సీపీఎస్ అంటే ఏమిటీ: పవన్, జగన్ హమీ అమలు సాధ్యమేనా?

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కానీ, కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతీ ఉద్యోగి జీతం నుండి కనీసం 10 శాతాన్ని పెన్షన్ స్కీమ్ కోసం కట్  చేస్తున్నారు.

ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్ లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడ ఉద్యోగి వేతనం కూడ కట్ చేసేవారు కాదు. 

పాత పెన్షన్ స్కీమ్ పద్దతిలోనే ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో  7 ఏళ్ళ పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30 శాతం పెన్షన్ గా చెల్లించేవారు.

Also read:సీపీఎస్‌ను రద్దు చేస్తాం: ఉద్యోగులకు బాబు హామీ

కానీ సీపీఎస్ విధానం ద్వారా  ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది.  అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ సంబంధించిన విషయమై 2013 వరకు చట్టం కాలేదు. 2004లో యూపీఏ తొలిసారిగా అధికారంలో ఉన్న కాలంలో వామపక్షాలకు పార్లమెంట్ లో గణనీయంగా ఎంపీలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎంపీల సంఖ్య తగ్గింది. వామపక్షాలు సంఖ్య తగ్గడంతో 2013 అక్టోబర్ మాసంలో ఈ స్కీమ్ ను చట్టంగా మారింది.

click me!