రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

By narsimha lodeFirst Published Aug 27, 2019, 11:39 AM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది ఏపీ సర్కార్.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది ఏపీ సర్కార్.రివర్స్ టెండిరింగ్ పనులను కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డివిజన్ బెంచ్ ను కోరింది ఏపీ సర్కార్.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ సాగనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఈ నెల 17వ తేదీన ఏపీ ప్రభుత్వం  టెండర్లను ఆహ్వానించింది. హెడ్ వర్క్స్, జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు గాను 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారంగా రూ. 4900 కోట్లకు టెండర్లను పిలిచింది.

పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను గత ప్రభుత్వం నవయుగ కంపెనీకి అప్పగించింది. ఈ కాంట్రాక్టును ఏపీ సర్కార్ రద్దు చేసింది. గతంలో చేసిన కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసుకోకూడదని కూడ పోలవరం అధారిటీ తేల్చి చెప్పింది.ఈ మేరకు ఈ నెల 16న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన హైకోర్టులో నవయుగ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రివర్స్ టెండరింగ్ పై వెనక్కు వెళ్లకూడదని  హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ ఈ నెల 26వ తేదీన డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.మంగళవారం నాడు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

 

click me!