శ్రీవారి నగలు మాయం: గోప్యంగా ఉంచిన టీటీడీ

By narsimha lodeFirst Published Aug 27, 2019, 10:51 AM IST
Highlights

తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి ఆభరణాలు మాయమయ్యాయి.ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.


తిరుపతి: తిరుమలలో శ్రీవారి నగలు మాయమయ్యాయి. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి నగలను ట్రెజరీలో భద్రపరుస్తారు. ట్రెజరీలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. శ్రీవారికి చెందిన రెండు బంగారు ఉంగరాలు,   ఐదు కిలోల వెండి మాయమైంది.

ఈ ఘటనకు బాధ్యుడుగా టీటీడీ ఏఈఓ శ్రీనివాసులును గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకొన్నారు.ఈ బంగారు,వెండి ఆభరణాలు మాయం కావడంపై  ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

అయితే ప్రతి నెల టీటీడీ ఏఈఓ శ్రీనివాసులు వేతనం నుండి ఈ ఆభరణాలకు సంబంధించిన సొమ్మును రికవరీ చేస్తున్నారు. ఈ  ఆభరణాలకు  సంబంధించి ప్రతి నెల రూ. 30 వేలను ఏఈఓ శ్రీనివాసులు జీతం నుండి రివకరీ చేస్తున్నట్టుగా సమాచారం.

ట్రెజరీలో భద్రపర్చిన ఆభరణాలు మాయమైన ఘటనలో అధికారులపై చర్యలు తీసుకోకుండా జీతం నుండి నగదును రికవరీ చేయడాన్ని కొందరు భక్తులు తప్పుబడుతున్నారు.

click me!