రాష్ట్రపతి పాలన ఏ సమయంలో విధిస్తారో, ఎందుకు విధిస్తారో చంద్రబాబుకు తెలియదా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభి సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు.
గుంటూరు: ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారో చంద్రబాబుకు తెలియదా అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన జనాగ్రహదీక్షలో Sajjala Ramakirishna Reddy ప్రసంగించారు.చంద్రబాబు రాష్ట్రపతి పాలన ఎలా కోరుకొంటారన్నారు.చంద్రబాబువి చిల్లర రాజకీయాలు అని ఆయన విమర్శించారు.
also read:గంటసేపు కళ్లు మూసుకొంటే మేమేంటే చూపిస్తాం:పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
undefined
లేన అంశంపై Tdp రచ్చ చేస్తోందని ఆయన మండిపడ్డారు.సీఎం Ys Jagan పైPattabhiఅడ్డగోలుగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఇలా మాట్లాడించడం ద్వారా రాష్ట్రంలో ఘర్షణలకు కారణమయ్యేలా ప్రయత్నం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.పట్టాభి నోరుజారి ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీఎంను ఉద్దేశించి పట్టాభి బూతు పదాన్ని నాలుగైదు సార్లు ఉపయోగించారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఈ మాటలను విన్న సీఎం జగన్ అభిమానులు కానీ, Ycp కార్యకర్తలు కానీ ఈ విషయమై ప్రశ్నించేందుకు అక్కడికి వెళ్లారన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన పట్టాభి అక్కడ లేకపోవడంతో దాడి చేసి ఉండొచ్చన్నారు. ఈ దాడి తర్వాత రాష్ట్రపతి పాలన చేయాలని Chandrababu Naiduడిమాండ్ చేయడం కూడా పథకం ప్రకారం ఈ వ్యాఖ్యలు చేయించారనే అనుమానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడే హక్కుందని చంద్రబాబు అంటున్నారని, ఈ హక్కు కోసం ఆయన దీక్ష చేస్తున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. ఈ బూతు మాటలను ఎవరైనా సమర్ధిస్తారా అని ఆయన ప్రజలను అడిగారు. ఈ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తారా అంటూ ప్రజలు టీడీపీ నేతలను నిలదీయాలని ఆయన కోరారు.
తమ వైపు నుండి ఉద్దేశ్యపూర్వకంగా ఏనాడూ కూడ అసభ్యపదజాలం ఉపయోగించలేదన్నారు. కానీ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే సమయంలో ఆవేశంతో నోరు జారకూడదని జగన్ హెచ్చరిస్తారని ఆయన చెప్పారు.టీడీపీ కార్యాలయాలపై దాడుల విషయంలో ప్లాన్ చేయలేదన్నారు. ప్లాన్ చేసి దాడి చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.టీడీపీ ఆఫీస్ దేవాలయం అంటూ చంద్రబాబు చెబుతున్నారని దేవాలయం లాంటి కార్యాలయంలో ఈ రకమైన భాషను ఉపయోగిస్తే వెంటనే ఆయనపై చర్య ఎందుకు తీసుకోలేదని సజ్జల ప్రశ్నించారు.