ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 26వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై కేంద్రం అసంతృప్తితో ఉన్నందున ఈ పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది.
అమరావతి: ఈ నెల 26వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు.పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై కేంద్రం ఏపీ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ తరుణంలోనే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ ప ర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఈ నెల 26వ తేదీన ఉదయం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే అంతరాష్ట్ర మండలి సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఈ సమావేశం తర్వాత జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
undefined
రివర్స్ టెండర్లు, పీపీఏల విషయమై కూడ జగన్ ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల విషయంలో కేంద్రం ఏ రకంగా వ్యవహరించనుందో అనేది ఆసక్తి నెలకొంది.
పోలవరం రివర్స్ టెండర్ల పై ఇప్పటికే పీపీఏ సీఈఓ జైన్ నుండి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నివేదికను తెప్పించుకొంది.ఈ విషయమై నిర్ణయం తీసుకొనేముందు అమిత్ షా, ప్రధానితో జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చర్చించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల పై 18 పేజీల నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఈ నెల 23వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు నివేదికను ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టు హైడల్, హెడ్ వర్క్స్‌కు సంబంధించి ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. రివర్స్ టెండర్లపై నవయుగ కాంట్రాక్టు కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.రివర్స్ టెండర్లపై ముందుకు వెళ్లకూడదని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా పర్యటన నుండి ఏపీకి తిరిగి వచ్చిన జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రివర్స్ టెండరింగ్ విషయమై న్యాయ నిపుణులతో కూడ ఏపీ సర్కార్ చర్చిస్తున్నట్టు సమాచారం.
రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ ఈ నెల 16వ తేదీన ఏపీ ప్రభుత్వానికి కూడ లేఖ రాశారు. ఈ పరిణామాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం జగన్ చర్చించే అవకాశం లేకపోలేదు.
రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టు మరింత ఆలస్యం కానుందని పీపీఏ వాదిస్తోంది. అయితే రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని జగన్ కేంద్ర మంత్రుల దృస్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
పీపీఏల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లపై ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు చెప్పిన మీదటే జగన్ నిర్ణయం తీసుకొన్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
సంబంధిత వార్తలు
రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...
పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్
రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్
జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు
జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్
రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
జైన్ షాక్: జగన్ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు