డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారింది - ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

By Sairam IndurFirst Published Mar 23, 2024, 6:48 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర రాష్ట్రాల  నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ఆమె ప్రశ్నించారు. 

ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. గంజా, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే "ఉడ్తా ఆంధ్రప్రదేశ్"గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో  ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే ఉంటున్నాయని ఆరోపించారు.

తీహార్ జైలుకు స్వాగతం - కేజ్రీవాల్ కు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం..

ఈ మేరకు శనివారం వైఎస్ షర్మిల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను మొదటి ఐదేళ్లు టీడీపీ, తర్వాత ఐదేళ్లు వైసీపీ పాలించాయని అన్నారు. ఈ పదేళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఆరోపించారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో ఏపీపై నెంబర్ 1 ముద్ర వేశారని తెలిపారు. 25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే.. తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలని ఆమె ఆరోపించారు.

అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారు.. అరెస్టు చట్ట విరుద్ధం - కల్వకుంట్ల కవిత

కేంద్ర రాష్ట్రాల  నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అని అన్నారు. మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీ "సేఫ్ హెవెన్" గా మార్చిందని ఆమె పేర్కొన్నారు.

click me!