హోంమంత్రి తానేటి వనితపై దాడి.. కారణమదేనా..?

By Rajesh KarampooriFirst Published May 8, 2024, 5:11 PM IST
Highlights

ఏపీలో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రానున్నదా? వైయస్ జగన్ ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోందా ? ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుడుతుందా ? అంటే.. కొన్ని ఘటనలు చూస్తే..  అవుననే సమాధానాలే వస్తున్నాయి. తాజాగా మహిళ నేత, రాష్ట్ర  హోం మంత్రి తానేటి వనితపైన దాడి ఘటన కూడా వైసీపీ తిరిగి అధికారంలోకి రానున్నట్టు తెలుస్తుంది. ఈ దాడిని తెలుగుదేశం గుండాలు యత్నించినట్టు వైసీపీ ఆరోపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది. 

ఏపీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రచారానికి మరికొద్దీ రోజుల సమయం ఉండటంతో పార్టీలన్నీ  ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలువుతున్నాయి. కానీ, కొన్నిసార్లు శ్రుతి మించుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి తానేటి వనితపై దాడి జరిగింది. ఏకంగా రాష్ట్ర హోం మంత్రిపై దాడికి కొంత మంది యత్నించడంతో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

అసలేం జరిగింది ?  

ఎన్నికల ప్రచారంలో భాగంలో తూర్పు గోదావారి జిల్లాలోని గోపాలపురం నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వనిత మంగళవారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకుని.. స్థానిక మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలతో గొడవకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ ప్రచార వాహనాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత హోం మంత్రి తానేటి వనితపైకి దూసుకెళ్లారు.  వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు.

ఈ సమయంలో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ ప్రచార వాహనంపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీ గుండాల చేతుల్లో అనేక మంది వైఎస్‌ఆర్‌సీపీ మహిళా పార్టీ కార్యకర్తలు వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై వేధింపులకు పాల్పడ్డారని, బనగానపల్లెలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా  హింసాత్మక దాడులు నమోదవుతున్నాయని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లా అండ్‌ ఆర్డర్‌ను పర్యవేక్షించే హోం మంత్రిపైనే ఇలా దాడికి పాల్పడ్డాన్ని వైసీపీ ఖండించింది. దాడి విషయం తెలుసుకున్న ఎస్పీ హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల రాకతో నల్లజర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా.. నల్లజర్లలో భారీగా పోలీసులను మోహరించారు.

కారణమిదేనా..

వాస్తవానికి.. మహిళా కేంద్రమైన వైఎస్ఆర్ చేయూత తోపాటు 5 సంక్షేమ పథకాల కింద రూ.10,000 కోట్ల నిధుల పంపిణీని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం,  ఈబీసీ నేస్తం, టీడీపీ పన్నిన ఈ కుట్ర గురించి క్షేత్రస్థాయిలోని ఓటర్లకు తెలుసు. టీడీపీ దుమ్మెత్తిపోయడం ఇదే తొలిసారి కాదంటూ మీడియా, సోషల్ మీడియాతో సహా పలు వేదికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి వాలంటీర్ సిస్టమ్ ద్వారా పెన్షన్ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో 66 లక్షల మందికి పైగా పెన్షనర్లను ఇబ్బందుల పాలు చేసినట్టు, దీనికి టీడీపీనే ప్రధాన కారణమని వైసీపీ ఆరోపిస్తుంది.  

ఆంధ్రప్రదేశ్‌లో 2.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండడం గమనార్హం. YSRCP 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రూ. 2.83 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందించిన 24 మహిళా కేంద్ర సంక్షేమ పథకాలను రూపొందించింది. అలాగే మహిళాలకు సాధికారత కల్పించేలా.. అన్ని భూములు, ఇళ్ల పట్టాలను మహిళల పేర్లపైనే పంపిణీ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇలా మహిళా ఓటర్లంతా సీఎం జగన్ కు మద్దతిస్తున్నారనీ, దీంతో కూటమి ఘోర పరాజయం పాల్పతుందని అంచనా వేస్తున్న టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే ఇలా నిర్విఘ్నంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

click me!