Mohammed Shami: ఒకప్పడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. నేడు వరల్డ్ కప్ హీరో అయ్యాడు.. పడిలేచిన కెరటం షమీ..
Mohammed Shami: ఒక్కప్పడు దేశ ద్రోహి అని దూషించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డడాని ఆరోపించారు. దేశం నుంచి వెళ్లిపోవాలని దుర్బాషలాడారు. కానీ నేడు తిట్టినోళ్లే.. నిన్ను మించిన తోపు లేరు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారత బౌలర్ మహ్మద్ షమీ లైఫ్ సోర్టీ..
Mohammed Shami: మహ్మద్ షమీ. ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆశల వారధి నిలిచాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అయినా.. ప్రస్తుత మెగా టోర్నీలో మహమ్మద్ షమీ మాత్రం టీమ్ ఇండియా బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై వేసుకుని జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఒకప్పుడూ దేశద్రోహి అంటూ తిట్టినోళ్లే.. నేడు నిన్ను మించిన తోపు లేరు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఎప్పుడూ చిరునవ్వు కనిపించే మహ్మద్ షమీ జీవితంలో ఎన్నో చీత్కారాలు, అవమానాలు, ఆవరోధాలు. షమీ కట్టుకున్న భార్య చేసిన ఆరోపణలను ఆసరాగా ఇతర జట్లతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దేశం నుంచి వెళ్లిపోవాలని దూషించడబడ్డాడు. అతనిపై దేశ ద్రోహి అని ముద్ర వేశారు. దీనికి తోడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వేధింపులకు గురి చేస్తున్నాడనీ, కట్నం కోసం తనను వేధిస్తున్నాడని, ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేసింది.
అంతేకాకుండా.. తనపై అత్యాచారం, హత్యాయత్నం చేశాడని కేసు పెట్టింది. ఆపై తన కన్న బిడ్డను దూరం చేసి.. కోర్టుకు లాగింది షమీ భార్య. ఆ సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడంట. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మీడియాకు దూరంగా ఉండే షమీ.. 2020లో భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి Instagram లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ తరుణంలో తన మదిలో బాధలను వెల్లిబుచ్చాడు. తాను ఎదుర్కొంటున్న కష్టాలను నెటిజన్లతో పంచుకున్నాడు. తాను 2015 లో గాయపడ్డననీ, దీంతో తాను జట్టులో స్థానం కోల్పోయానని తెలిపారు. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను జట్టులోకి పునరాగమనం చేయడానికి ఎంత సమయం పడుతుందో రోహిత్ కు తెలుసునని చెప్పారు. అదే సమయంలో తాను కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొవల్సి వచ్చిందని పలు మార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా: మహ్మద్ షమీ
షమీ రోహిత్‌తో మాట్లాడుతూ.. ’మా కుటుంబం మద్దతు లేకపోతే.. నేను క్రికెట్‌ను వదిలి ఉండేవాడిని. ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నాను. నేను చాలా కృంగిపోయాను, మా కుటుంబం చాలా ఆందోళన చెందింది. నా ఇల్లు 24వ అంతస్థులో ఉండటంతో నేను అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానేమోనని నా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అందుకే కుటుంబ సభ్యులు ఎప్పుడూ నాపై కన్నే వేసేవారని చెప్పుకొచ్చారు.
నా కుటుంబమే నా బలం: మహ్మద్ షమీ
మా కుటుంబం నాకు చాలా సపోర్ట్ చేసింది అని షమీ చెప్పాడు. నా కుటుంబమే నా బలం. నా సమస్యలన్నింటికీ నా కుటుంబమే పరిష్కారం చూపించింది. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టానికి నా కుటుంబం ఎంతో మద్దతుగా నిలిచారు. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా బాధగా అనిపించేది. నువ్వు ఆటపైనే దృష్టి పెట్టు అని మా సోదరుడు, మా కుటుంబ సభ్యులు నాతో చెప్పేవారు. నా మంచి స్నేహితులు చాలా మంది కష్ట సమయాల్లో నన్ను ఆదరించారని తెలిపారు.
ప్రపంచకప్‌లో షమీ ప్రయాణం అద్బుతం
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అధిక వికెట్లు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వాస్తవానికి ఈ టోర్నీలో షమీ మొదటి 4 మ్యాచ్‌లు ఆడనేలేదు. అయినప్పటికీ టోర్నీలో ప్రస్తుతానికి అత్యధిక వికెట్లు తీసింది షమీనే. ఇప్పటికే మూడు సార్లు 5 వికెట్లు తీసిన టాప్ వికెట్ టేకర్ గా నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన షమీకి నేడు భారత్ సెల్యూట్ చేస్తోంది.
ఐసీసీ ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసిన మహ్మద్ షమీపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. న్యూజిలాండ్‌పై మహ్మద్ షమీ 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ పోరులో అడుగుపెట్టడానికి మార్గం సుగమం చేశారు. ఈ టోర్నీలో షమీ ఇప్పటివరకు 23 వికెట్లు పడగొట్టాడు. ఇదే సమయంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన రికార్డ్ తన పేరిట నెలకొల్పాడు. షమీ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వాటిని పక్కన పెట్టి.. నేడు హీరోగా నిలిచారు.