నా ఫోన్‌ను కూడ ట్యాప్ చేసి ఉండొచ్చు: ఎంపీ బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మధ్య జరిగిన సంభాషణపై ఆయన స్పందించారు. తన ఫోన్ ను కూడ ట్యాప్ చేసి ఉండొచ్చన్నారు. 

Karimnagar MP Bandi Sanjay Reacts on phone conversation with collector

కరీంనగర్: నా ఫోన్‌ను కూడ ట్యాప్ చేసి ఉండవచ్చని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్  అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఖర్చుల విషయమై తాను హైకోర్టులో కేసు వేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత  బండి సంజయ్ కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తో బండి సంజయ్  ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఫోన్  సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

Also read:బండి సంజయ్‌తో మాట్లాడా: కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ ఆరా

ఈ విషయమై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ప్రతిపక్షాల నేతల పోన్లను  ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ క్రమంలోనే తన ఫోన్‌ను కూడ ట్యాప్ చేసి ఉండొచ్చన్నారు.

ఆడియో లీకేజీలో కొత్త విషయాలు కూడ బయటకు వచ్చాయన్నారు. గంగుల కమలాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఖర్చు విషయమై హైకోర్టులో కేసు వేసినట్టుగా ఆయన చెప్పారు.మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఎంపీ బండి సంజయ్ తెలిపారు.  

ఈ వీడియోపై రాష్ట్ర రాజకీయాల్లో  చర్చ సాగుతోంది.  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఫోన్‌లో మాట్లాడిన విషయాలపై సీఎంఓ ఆరా తీసినట్టుగా సమాచారం.

నియమ నిబంధనలకు అనుగుణంగానే తాను బండి సంజయ్‌తో పోన్‌లో మాట్లాడినట్టుగా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ విషయమై తెలంగాణ సీఎంఓ అధికారులు కూడ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ కు కూడ తాను ఫిర్యాదు చేసినట్టుగా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

తనను ఓడించేందుకు తెరవెనుక జరిగిన కుట్రలో వాస్తవాలను బయటకు తీసుకురావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరుతున్నారు. ఈ విషయమై చట్టం తన పని తాను చేసుకొంటూ వెళ్తుందన్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios