Asianet News TeluguAsianet News Telugu

క్రైమ్ రౌండప్: సమత హత్యాచారంపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. ఒడిషాలో మరో దిశ, మరిన్ని

కొమురం భీం జిల్లాలో వివాహిత సమత‌పై అత్యాచారం, హత్య కేసులో విచారణకు గాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇద్దరు బిడ్డలున్న వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి నేరవార్తలు మీకోసం.
 

this week crime roundup
Author
Hyderabad, First Published Dec 15, 2019, 4:31 PM IST

కొమురం భీం జిల్లాలో వివాహిత సమత‌పై అత్యాచారం, హత్య కేసులో విచారణకు గాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇద్దరు బిడ్డలున్న వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి నేరవార్తలు మీకోసం.

సమత హత్యాచారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమతపై గ్యాంగ్‌రేప్, హత్య చేసిన ఘటనపై చార్జీషీట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులకు శిక్ష పడేందుకుగాను శాస్త్రీయ ఆధారాలను కూడ పోలీసులు సేకరించారు.

గత నెల 24వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కుమరంభీమ్ జిల్లా రామ్ నాయక్ తండా సమీపంలో ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సమత హత్య కేసు నిందితులను కూడ కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మొదలైంది. ఆందోళనలు కూడ కొనసాగాయి.దీంతో పోలీసులు కూడ ఈ కేసు విషయమై చర్యలు చేపట్టారు.

Also Read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

సమతపై గ్యాంగ్‌రేప్, హత్య కేసులో 44 మంది సాక్షులను విచారించి పోలీసులు చార్జీషీట్ ను శనివారం నాడు దాఖలు చేశారు. 96 పేజీలతో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చశారు. శాస్త్రీయ ఆధారాలను కూడ చార్జీషీట్ లో పొందుపర్చారు. 96 పేజీల చార్జీషీట్‌లో 13 పేజీల్లో ఛార్జీషీట్. మిగిలిన పేజీల్లో సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికతో పాటు పంచనామా వివరాలు ఉన్నాయి.

ఒడిషాలో మరో దిశ: 

నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడ సమితిలోని గమండల గ్రామంలో ఓ బాలికపై కొందరు దుండగులు సామూహితక అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలో దియాలి పర్వదినం చేసుకుని బాధితురాలు ఇంటికి చేరుకునింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమి కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

అయితే ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు, బంధువుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు, బాలిక కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

అక్కడ బాధితురాలి మృతదేహంతో పాటు రెండు పురుషుల జీన్స్ ప్యాంటులు, చెప్పులు పడివుండటంతో పాటు బాలిక శరీరంపై రక్కిన గాయాలను చూశారు. దీంతో వారు బాలిక అత్యాచారానికి గురైందని నిర్థారించారు. వెంటనే బాలిక కుటుంబసభ్యులు కొశాగుమడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా బాలికై అత్యాచారం, హత్య ఘటనపై నవరంగ‌పూర్ జిల్లా మాఘొరొ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు కాదంబనీ త్రిపాఠి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణంపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు. 

డిగ్రీ విద్యార్ధినిని ట్రాప్ చేసిన ఇద్దరు పిల్లలు తండ్రి

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక ఫాతిమా అనే డిగ్రీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే మదనపల్లిలోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న ఫాతిమా అనే విద్యార్ధిని ఇబ్రహీం అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఫాతిమా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఇబ్రహీం ఆమెను రేపు మాపు అంటూ దూరం పెట్టసాగాడు. ఈ క్రమంలో అతనికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నట్లు తెలుసుకున్న ఫాతిమా తీవ్ర మనస్తాపానికి గురైంది.

Also Read:నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్

ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు ఇబ్రహీం తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తల్లిదండ్రులకు వాట్సాప్‌లో మేసేజ్ చేసిన ఫాతిమా.. అతనితో కలిసి దిగిన ఫోటోను సైతం పంపించింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న తమ బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఆమె మృతదేహాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తల్లిదండ్రులు అతనిని కఠినంగా శిక్షిస్తేనే తమ కూతురికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. కాగా అతను గతంలోనే మరో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసిగించినట్లుగా తెలుస్తోంది. 

ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం

దాదాపు 12 సంవత్సరాల క్రితం.. ఏపీలో ఓ బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కలకలం రేపింది. తాను ఉండే హాస్టల్ బాత్రూమ్ లోనే ఆయేషా మీరా మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం అతి  కిరాతకంగా హత్య చేశారు. కాగా... ఈ కేసును దర్యాప్తును దాదాపు 12 సంవత్సరాల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం ప్రారంభించారు.

Also Read:ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభం

తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీ పోస్టుమార్టం కేసు సిబిఐకి అప్పగించినందున ఆధారాల కోసం రీ పోస్టు మార్టం చేస్తున్నారు.
 
ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్‌ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది

Follow Us:
Download App:
  • android
  • ios