దృశ్యం సినిమా లాగా... హత్య కేసులో తప్పించుకునేందుకు

పదేళ్ల పాటు సహజీవనం చేసిన వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఓ మహిళ.  ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గ్రామంలో చోటు చేసుకొంది. అయితే ఈ హత్య కేసులో  ప్రధాన పాత్ర పోషించిన తన  కూతురు, అల్లుడిని కేసు నుండి తప్పించుకొనేందుకు గాను దృశ్యం సినిమా‌ను ఫాలో అయింది. ఈ హత్యను ఎలా చేసిందో పోలీసులకు నిందితురాలు వివరించింది. 

కర్ణాటకకు చెందిన విజయకుమార్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు.  జిల్లాలోని జగ్గయ్యపేట ధనంబోర్డులో మకాం పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత రాధతో విజయ్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. రాధ తన భర్తకు దూరమై ఇద్దరు బిడ్డలతో నివాసం ఉంటుంది. దీంతో రాధతో విజయ్ కుమార్ సహజీవనం చేస్తున్నాడు.

విజయ్‌కుమార్‌ సహకారంతో రాధ తన పిల్లల్ని పెంచింది. రాధ పెద్ద కొడుకు ఇంటర్ పూర్తి చేశాడు. అతను ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. కూతురికి వివాహం కూడ చేసింది. అంతేకాదు రాధ ఓ ఇల్లును కూడ కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం రాధ అల్లుడు విజయ్‌కుమార్‌ వద్ద రూ. 50వేలు అప్పుగా తీసుకొన్నాడు. అయితే ఈ డబ్బును తిరిగి చెల్లించాలని  విజయ్ కుమార్  రాధను అడిగాడు. ఈ విషయమై ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో శనివారం నాడు మరోసారి గొడవ జరిగింది. 

దీంతో ఆగ్రహంతో రాధ విజయ్‌కుమార్‌ను గడ్డపారతో పొడిచింది.  అంతేకాదు ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసింది. ఈ కేసు నుండి తన కొడుకు,. కూతురు, అల్లుడిని తప్పించేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ హత్య విషయమై పోలీసులు నిందితురాలిని  ప్రశ్నిస్తే అసలు విషయాన్ని చెప్పింది. తన అల్లుడు, కూతురిపై విజయ్‌పై దాడి చేస్తోంటే అడ్డుకొనే క్రమంలో తాను విజయ్‌కుమార్‌పై గడ్డపారతో దాడి చేసినట్టుగా నిందితురాలు చెప్పారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాకినాడలో కిడ్నాప్ కలకలం

తూర్పు గోదావరి  జిల్లా కాకినాడ పట్టణంలో  జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ కు గురైంది. పోలీసులు  పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ బాలిక కిడ్నాప్ వెనుక సవతి తల్లి పాత్ర ఉందని చిన్నారి నాయనమ్మ ఆరోపిస్తోంది.

సవతి తల్లి శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసి ఉప్పుటేరు కాల్వలో పడేశానని కాసేపు, సంజయ్‌ నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వద్ద పడేసానని పోలీసుల విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు దీప్తిశ్రీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

శుక్రవారం నుంచి దీప్తిశ్రీ  కన్పించకుండాపోయింది. తూరంగి పంచాయతీ పగడాలపేటకు చెందిన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసానిని శుక్రవారం పాఠశాల నుంచి నేరుగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు చిన్న నానమ్మ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి చేరకపోవడంతో తండ్రి సూరాడ సత్యశ్యామ్‌ కుమార్‌ ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.

నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్: రూ.50 లక్షల వసూలు

 

విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరిట ఆమెకు దగ్గరయ్యాడు.  ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి.. స్పృహలేని సమయంలో ఆమె అభ్యంతరకర చిత్రాలు తీశాడు. వాటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ తర్వాత పలు మార్లు బెదిరించి ఆమె వద్ద నుంచి దాదాపు రూ.50లక్షలు వసూలు చేశాడు.

ఇంకా ఇవ్వాలని బెదిరించడంతో... తన దగ్గరలేవని ఆమె చెప్పింది. తన దగ్గర ఇంక డబ్బులు లేవని.. అప్పుల్లో కూరుకుపోతానని ఆమె చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో... అతని తల్లిదండ్రులను ఆమె బ్రతిమిలాడింది. అయితే... వాళ్లు కూడా ఆమె బాధను పట్టించుకోకపోవడం గమనార్హం. అక్కడితో ఆగకుండా...తమ కొడుకు చెప్పింది కరక్టేనంటూ వాధించడం గమనార్హం.

దీంతో బాధితురాలు చిట్టచివరగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. విచారణలో పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని విస్తుపోయారు.  యువతి ఇచ్చిన డబ్బులను అతనితోపాటు తల్లిదండ్రులు కూడా పంచుకునేవారని తెలిసి పోలీసులు విస్తుపోయారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

పెళ్లయిన రెండు రోజులకే భర్తకు విషం

పెళ్లి జరిగిన వారానికే భర్తను చంపేందుకు యువతి మజ్జిగలో విషం కలిపిందన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. పెళ్లి ఇష్టం లేనందువల్ల మజ్జిగలో విషం కలిపి భర్తను హత్య చెయ్యాలని చూసిందంటూ వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు ఈ నెల 11న మద్దికెర మండలం మందనంతపురానికి చెందిన నాగమణితో వివాహమైంది. వారం రోజుల తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు లింగమయ్య.

 అదే రోజు సాయంత్రం తన భార్య మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందంటూ లింగమయ్య అనంతపురం ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.  పెళ్లి ఇష్టం లేనందువల్ల భార్య తనకు పురుగుల మందు కలిపిన మజ్జిగ ఇచ్చిందంటూ ఆ మజ్జిగ గ్లాసును కూడా అతను అందరికీ చూపించాడు. 

దీంతో అంతా నిజమేనని భావించారు. అయితే, కొత్తపెళ్లికూతురు నాగమణి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. భర్తకు ఇచ్చిన మజ్జిగను ముందుగా తాను తాగిందని  వధువు కుటుంబసభ్యులు చెప్పారు. పురుగుల మందు కలిపి ఉంటే ఎలా తాగుతుందంటున్నారు. ఆమెకు భర్తను చంపాల్సిన ఉద్దేశం ఎంతమాత్రమూ లేదంటున్నారు. 

Read Also: 

అచ్చు దృశ్యం సినిమానే: పదేళ్లు సహజీవనం, హత్య

కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కలకలం