ప్రియుడితో రాసలీలలు చూసిందని బిడ్డ హత్య:

 

తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి.అయితే ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ ఆమె వెతికింది. విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకొంది. విజయవాడ గ్రామీణ పరిధిలోని గొల్లపూడి భవానీపురంలో మొవ్వ అనిల్, వెంకటరమణలు భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా చేసే గోదాంలో కూలీ పని చేసేవాడు.

అనిల్ భార్య వెంకటరమణ తాము నివాసం ఉండే ప్రైవేట్ కాలేజీలో స్వీపర్ గా పనిచేసేది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు.ఎనిమిదేళ్ల కూతురు ద్వారక మాత్రం  తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ద్వారక స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అనిల్ , వెంకటరమణ దంపతులు నివాసం ఉండే ఇంటి పక్కనే పెంటయ్య తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అనిల్ భార్య ఆదివారం నాడు పుట్టింటికి వెళ్లింది.

Also Read:ప్రియుడితో తల్లి రాసలీలలు: విజయవాడ ద్వారక హత్యలో ట్విస్ట్

ఆదివారం కావడంతో ద్వారక ఆడుకొంటూ టీవీ చూసేందుకు పెంటయ్య ఇంటికి వెళ్లింది. అప్పటికే అదే ఇంట్లో తన తల్లి వెంకటరమణ పెంటయ్యతో రాసలీలలో మునిగితేలుతోంది. ఈ విషయాన్ని ద్వారక చూసింది. వివాహేతర సంబంధం విషయమై ద్వారక తల్లి వెంకటరమణను నిలదీసింది. నాన్నకు చెబుతానని ద్వారక తెగేసి చెప్పింది.ఈ విషయం తన భర్తకు తెలిసే అవకాశం ఉందని భావించిన వెంకటరమణ తన ప్రియుడు పెంటయ్యను తన కూతురు చంపాలని పురమాయించి తన ఇంటికి వెళ్లిపోయింది.

దీంతో ద్వారకను పెంటయ్య హత్య చేశాడు. ద్వారక మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో గోనెసంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు.ఆదివారం మధ్యాహ్నం నుండి తన కూతురు కన్పించడం లేదని వెంకటరమణ ఏమీ తెలియనట్టుగానే నాటకం ఆడింది. కుటుంబసభ్యులతో కలిసి వెంకటరమణ కూడ వెతికింది.

ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం

 

ప్రసాదం కోసం గుడికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన దూడల సాంబశివరావు కుమార్తె కార్తీకమాసం మొదలైన దగ్గర నుంచి ప్రసాదం  కోసం శివాలయంకు ప్రతి రోజు వెళ్లి వస్తుంది. 

ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్ళిన పాప తిరిగి రాకపోవడంతో కంగారు పడుతూ తండ్రి సాంబశివరావు సాయంత్రం 6.30 పాప ను వెతుక్కుంటూ వెళ్లాడు.  రైస్ మిల్లు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పాప  తనుశ్రీ పై అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ళ దూడల ధనుష్ ఉండగా తండ్రి సాంబశివరావు కేకలు వేసుకుంటూ  పరుగెత్తాడు.

Also Read:విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

అతడి అరుపులకు భయపడ్డ  ధనుష్ అక్కడి నుంచి  పారిపోయాడు. తీవ్ర రక్త  రక్త స్రావంతో  ఉన్న  పాపను RMPడాక్టర్ వద్దకు తీసుకు  వెళ్లగా అత్యాచారం  జరిగినట్లు నిర్ధారించాడు. గురువారం రాత్రి పమిడి ముక్కల పోలీసు స్టేషన్ లో బాలిక తండ్రి సాంబశివరావు పిర్యాదు చేశాడు.  ఈ మేరకు శుక్రవారం ధనుష్ పై IPC 376, పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై G. శ్రీనివాస్ తెలిపారు.

పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త

 

భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం భర్తకు నచ్చలేదు. దీంతో...ఆమెను తన సోదరుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... గోవిందరాయునిపేటకు చెందిన ఫకృద్దీన్‌ 12 ఏళ్ల కిందట శింగనమలకు చెందిన శంషాద్‌ను వివాహం చేసుకున్నాడు. మేకలు మేపుకుంటూ దంపతులు జీవనం సాగించేవారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా తన భార్య శంషాద్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు ఫకృద్దీన్‌ అనుమానించాడు. 

ఇదే విషయాన్ని తన బావమరిది దాదాఖలందర్‌కు వివరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని భావించిన ఫకృద్దీన్‌ ఆమెను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగా సోదరుడు దస్తగిరితో కలిసి ఈనెల 7వతేదీ సాయంత్రం ఇంటి సమీపంలోని మాల కొండపైన మేకలను మేపుతున్నాడు. మేకల వద్దకు రావాలని తన భార్యకు ఫోన్‌ చేసి పిలిచాడు. దీంతో శంషాద్‌ కొండపైకి వెళ్లింది. 

అప్పటికే కాపుకాచిన భర్త ఫకృద్దీన్‌, ఆమె మరిది దస్తగిరిలు ఆమెపై రాళ్లతో దాడి చేసి హత మార్చారు. అనంతరం పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పు పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే శంషాద్‌ది ఆత్మహత్య కాదని, హత్యచేశారని కొందరు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శంషాద్‌ను తామే చంపినట్లు భర్త ఫకృద్దీన్‌, మరిది దస్తగిరి ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

 

వృద్ధ దంపతులను మోసం చేసిన బంగ్లాదేశీయులు

 

బంగ్లాదేశ్ కి చెందని జువెల్ హుస్సేన్(21), లాబ్లూ హుస్సేన్(33) పది రోజుల క్రితం మన దేశంలోకి ప్రవేశించారు.  కేరళలోని ఓ గుడి నిర్మాణ పనుల్లో కూలీలుగా రెండు రోజులు పనిచేశారు. ఆ తర్వాత మరోచోట గడ్డికోసే పనికి మారారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ దంపతులతో పరిచయం పెంచుకున్నారు.
 
వారి ఒంటిపై బంగారు ఆభరణాలు గమనించి, ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉండొచ్చని భావించారు. ఈ నెల 11న వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై ఇనుపరాడ్లతో దాడిచేసి హతమార్చారు. సొత్తు సర్దుకుని 12న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేరళ పోలీసుల నుంచి మంగళవారం విశాఖపట్నం ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం వచ్చింది.

అనుమానితుల ఫొటోలు పంపడంతో ఈ మేరకు విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా, పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలుస్వాధీనం చేసుకున్నారు.

అదనపు కట్నం కోసం భార్యను నగ్నంగా వీడియో తీసి, భర్త బ్లాక్‌మెయిలింగ్

 


గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేటకు చెందిన దంపతులు తమ పెద్ద కుమార్తెను తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. కాగా.. పెళ్లైన కొద్ది రోజులు భార్యతో ప్రేమగా ఉన్న వ్యక్తి తర్వాతర్వాత తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు. అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

అదనపు కట్నం ఇవ్వడానికి ఆమె అంగీకరిచకపోవడంతో.. బ్లాక్ మెయిల్ కి దిగాడు. భార్య స్నానం చేస్తున్న క్రమంలో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి.. అదనంగా కట్నం తేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అతని వేధింపులు రోజూ తీవ్రతరం కావడంతో... సదరు మహిళ తన తల్లి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.