విజయవాడ:తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి.అయితే ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ ఆమె వెతికింది.విజయవాడ భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

Also read:విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

ఈ నెల 10వ తేదీన ఎనిమిదేళ్ల ద్వారక కన్పించకుండా పోయింది. ద్వారక మృతదేహం ఈ నెల 11వ తేదీన సాయంత్రం ద్వారక నివాసం ఉండే పక్కింట్లోనే గోనెసంచిలో లభ్యమైంది. ద్వారకను హత్య చేసిన తర్వాత మృతదేహన్ని తరలించే వీలు లేకపోవడంతో నిందితుడు పెంటయ్య తాను నివాసం ఉండే ఇంట్లోని గోనెసంచిలోనే మృతదేహన్ని ఉంచాడు.

Also Read:ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

విజయవాడ గ్రామీణ పరిధిలోని గొల్లపూడి భవానీపురంలో మొవ్వ అనిల్, వెంకటరమణలు భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా చేసే గోదాంలో కూలీ పని చేసేవాడు.

అనిల్ భార్య వెంకటరమణ తాము నివాసం ఉండే ప్రైవేట్ కాలేజీలో స్వీపర్ గా పనిచేసేది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు.ఎనిమిదేళ్ల కూతురు ద్వారక మాత్రం  తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.

Also Read:చిత్తూరు బాలికపై అత్యాచారం, హత్య... మహిళా కమీషన్ ఛైర్మన్ ఏమన్నారంటే

ద్వారక స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అనిల్ , వెంకటరమణ దంపతులు నివాసం ఉండే ఇంటి పక్కనే పెంటయ్య తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అనిల్ భార్య ఆదివారం నాడు పుట్టింటికి వెళ్లింది.

ఆదివారం కావడంతో ద్వారక ఆడుకొంటూ టీవీ చూసేందుకు పెంటయ్య ఇంటికి వెళ్లింది. అప్పటికే అదే ఇంట్లో తన తల్లి వెంకటరమణ పెంటయ్యతో రాసలీలలో మునిగితేలుతోంది.

ఈ విషయాన్ని ద్వారక చూసింది. వివాహేతర సంబంధం విషయమై ద్వారక తల్లి వెంకటరమణను నిలదీసింది. నాన్నకు చెబుతానని ద్వారక తెగేసి చెప్పింది.ఈ విషయం తన భర్తకు తెలిసే అవకాశం ఉందని భావించిన వెంకటరమణ తన ప్రియుడు పెంటయ్యను తన కూతురు చంపాలని పురమాయించి తన ఇంటికి వెళ్లిపోయింది.

దీంతో ద్వారకను పెంటయ్య హత్య చేశాడు. ద్వారక మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో గోనెసంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు.ఆదివారం మధ్యాహ్నం నుండి తన కూతురు కన్పించడం లేదని వెంకటరమణ ఏమీ తెలియనట్టుగానే నాటకం ఆడింది.
కుటుంబసభ్యులతో కలిసి వెంకటరమణ కూడ వెతికింది.

అనిల్ కుటుంబసభ్యులతో కలిసి పెంటయ్య కూడ ద్వారక కోసం వెతికాడు. అయితే ఈ విషయం తెలుసుకొన్న పెంటయ్య భార్య సునీత పుట్టింటి నుండి వచ్చింది. తన ఇంట్లో పరుపు పక్కనే ఉన్న గోనెసంచిలో ద్వారక మృతదేహన్ని చూసింది.

ఈ విషయాన్ని పెంటయ్య భార్య సునీత స్థానికులకు సమాచారం ఇచ్చింది.స్థానికులు గోనెసంచిలో ఉన్న బాలిక మృతదేహాన్ని తీశారు. స్థానికులు పెంటయ్యను చితక్కొట్టారు. పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఈ విషయమై తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెంటయ్య చెప్పారు.