వరంగల్/ నల్లగొండ: తెలంగాణలోని వరంగల్ లో ఓ మహిళ తన భర్తను ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ప్రేయసి ఇంట్లో ఆమెతో కలిసి ఉన్న భర్తను మహిళ పట్టుకుంది. శ్రీనివాస్ అనే ఆ వ్యక్తిని భార్య బయటకు లాక్కుని వచ్చి చితకబాదింది.

భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళ అతని కదలికలపై నిఘా పెట్టింది. తాజాగా అతను తన ప్రేయసి ఇంట్లో ఉండగా పట్టుకుంది. భర్త శ్రీనివాస్ ను ఆమె చితకబాదుతున్న దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. భర్త ప్రేయసిపై కూడా ఆమె ఘర్షణ పడుతున్న దృశ్యాలు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రసారమయ్యాయి. 

ఇదిలావుంటే, నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నర్సింగ్ బట్ల గ్రామంలో ఓ యువకుడు లింగస్వామి తన తల్లి శాంతమ్మపై కిరోసిన్ పోసి ఆమెకు నిప్పటించాడు. 

ఆ ఘటనలో శాంతమ్మ సజీవ దహనమైంది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ వస్తున్న లింగస్వామి లాక్ డౌన్ కారణంగా ఇంటికి చేరుకున్నాడు. తల్లిని పోషించలేని స్థితికి చేరుకున్నాడు. దాంతో తల్లిని హత్య చేసినట్లు భావిస్తున్నారు.