Asianet News TeluguAsianet News Telugu

మహబూబాబాద్‌లో ఉద్రిక్తత: పోలీసులపై రాళ్లతో దాడి, గాయాలు

మహబూబాబాద‌్‌లో బుధవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఇళ్ల నిర్మాణాలను కూల్చివేతకు నిరసనగా ఈ దాడి జరిగింది. 

Tension prevails at babu naik thanda in mahabubabad district
Author
Mahabubabad, First Published Feb 12, 2020, 2:44 PM IST

మహబూబాబాద్:అసైన్డ్ భూముల్లో నిర్మాణాల కూల్చివేత సమయంలో  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం బాబునాయక్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.బుధవారం నాడు గ్రామస్తులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడితో  గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మహబూబాబాద్  పరిధిలోని బాబునాయక్ తండా 504 సర్వే నెంబర్‌లోని అసైన్డ్ భూమిలో  నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలను  రెండు రోజులుగా రెవిన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. 

బుధవారం నాడు ఉదయం కూడ నిర్మాణాల కూల్చివేతలు చేసేందుకు అధికారులు, పోలీసులతో కలిసి బాబునాయక్ తండాకు చేరుకొన్నారు.  స్థానికులు పోలీసుల వాహనంపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీకి దిగారు.

స్వల్ప లాఠీచార్జీ చేయడంతో ఓ వృద్దురాలు  స్పృహ తప్పిపడింది. దీంతో స్థానికులు మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు.  దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

స్పృహ తప్పిన వృద్దురాలిని పోలీసులే తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్థానికులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  అసైన్డ్ భూముల్లోని నిర్మాణాలను కూల్చివేయక తప్పదని తేల్చి చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios