ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

నేటి కాలంలో మనిషి సంసార బాంధవ్యాలలో చిక్కుకుపోయాడని, మానసిక ప్రశాంతత నేటి యువతకు, నేటి సమాజానికి లేకుండా పోయిందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి. 

navaratri celebrations in MP captain laxmikantha rao house in hanamkonda

నేటి కాలంలో మనిషి సంసార బాంధవ్యాలలో చిక్కుకుపోయాడని, మానసిక ప్రశాంతత నేటి యువతకు, నేటి సమాజానికి లేకుండా పోయిందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ హంటర్ రోడ్ లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు నివాసంలో స్వామిజీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు.

నాలుగోరోజైన  బుధవారం  రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ దంపతులు, తెలంగాణా ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సీ అండ్ ఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐ జీ నవీన్ చంద్, ఎంపీ పసునూటి దయాకర్, వరంగల్ రూరల్  జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్ పర్సన్ డా. సుధీర్ కుమార్ వొడితల కుటుంబ సభ్యులు వొడితల కిషన్ రావు, శ్రీనివాస రావు, కౌశిక్, ఇంద్రనీల్, పూజిత తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. 

navaratri celebrations in MP captain laxmikantha rao house in hanamkonda

నాలుగోరోజు శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం, రాజ శ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అద్భుతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వాత్మామందేంద్ర స్వామి వారు భక్తులకు ఉపదేశం చేసారు. ప్రతిరోజు భగవత్ ధ్యానం చేయాలని, దేవాలయాలను సందర్శించడం, దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

యాంత్రిక మయమైన, బంధాలు, బాంధవ్యాలతో నిత్యం సతమతమయ్యే జీవనంలో మనిషి మానసికమైన తృప్తిని అనుభవించలేక పోతున్నాడని.. వీటన్నింటికి దైవ చింతనే పరిష్కారమని బోధించారు.

శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవని, ఇతీహాసాల్లో అమ్మవారి ప్రాశస్త్యం గురించి విపులంగా వివరించబడి ఉందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారని, వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారని తద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios