వరంగల్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానిక చెందిన కీలక నేత కెంగెర్ల మల్లయ్య బీజేపీ అనుబంధ సంఘంగా ఉన్న బిఎంఎస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని వీడాలని భావిస్తున్నారని సమాచారం.రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉండేది. ఎన్నికల సమయంలో ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత ఈ పదవిని ఎవరూ స్వీకరించలేదు.ఆరుజిల్లాలో సింగరేణి విస్తరించింది. ఈ ఆరు జిల్లాలో సింగరేణి కార్మికులను కెంగెర్ల మల్లయ్య కూడగట్టారు. అంతేకాదు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయంలో కూడ ఈ కార్మిక సంఘం కీలక పాత్ర పోషించింది.

అయితే కొంత కాలంగా కెంగెర్ల మల్లయ్య అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. దీంతో ఆయన బిఎంఎస్ లో చేరాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శుక్రవారం నాడు జరగనుంది ఈ సమావేశంలో మల్లయ్య తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

బిఎంఎస్ లో చేరాలని మల్లయ్య నిర్నయం తీసుకొన్నారని... తన వెంట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుండి ఒక వర్గాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.