భర్తను సజీవంగా దగ్ధం చేసిన మహిళ: ప్రియుడితో పాటు అరెస్టు
ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను సజీవంగా దహనం చేసింది. ఈ సంఘటన తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. ప్రియుడితో పాటు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్: ప్రియుడి మోజులో పడిన మహిళ అత్యంత దారుణమైన చర్యకు ఒడిగట్టి కటకటాలు లెక్కిస్తోంది. మహిళ తన ప్రియుడితో కలిసి ఆదివారం రాత్రి తన భర్తను చంపింది. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో ఈ దారుణం జరిగింది.
భర్త హోం గార్డుగా పనిచేస్తున్న తన భర్తను మహిళ హత్య చేసింది. భర్త హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.
జ్యోతి అనే మహిళ తన ప్రియుడు జిల్లా రాజుతో కలిసి భర్త దుష్యంత్ సింగ్ ను హత్య చేసి శవాన్ని కాల్చేసింది. బూడిదను గ్రామంలోని చెరువులో కలిపేశారు. దుష్యంత్ సింగ్ (40) వరంగల్ ట్రాఫిక్ విభాగంలో హోం గార్డుగా పనిచేస్తు్నాడు. మండల కేంద్రంలో అతని భార్య జ్యోతి టైలరింగ్ షాపు నడుపుతుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త విధులకు వెళ్లిన సమయంలో జ్యోతి అప్పలరావుపేటకే చెందిన జిల్లా రాజుతో సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ విషయం దుష్యంత్ సింగ్ కు తెలిసింది. దాంతో అతన్ని చంపడానికి ఇద్దరు కలిసి పథకరచన చేశారు
వారిద్దరు కలిసి దుష్యంత్ సింగ్ ను అప్పలరావుపేటకు తీసుకుని వెళ్లి అక్కడ అర్థరాత్రి వరకు అతనితో మద్యం తాగించి, అతను మత్తులోకి వెళ్లిన తర్వాత సజీవంగా దగ్ధం చేసినట్లు తెలుస్తుతోంది. ఆ తర్వాత అవశేషాలను చెరువులో కలిపారు.