కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన కుమారస్వామి కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇ

తను భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పట్టణంలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున చిన్న కుమార్తెపై లైంగికదాడికి పాల్పడుతుండగా పెద్ద కూతురు చూసి తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు కుమమారస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అతను తన చిన్నకూతురిపై దాదాపు మూడు నెలల నుంచి అత్యాచారం చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.