వరంగల్: తెలంగాణలోని వరంగల్ లో కారు బీభత్సం సృష్టించింది. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో రోడ్లు ఖాళీగా ఉండడంతో వాహనాలు అదుపులోని వేగంతో దూసుకుపోతున్నాయి. ఏ మాత్రం పట్టింపులేని ఓ కారు దూసుకొచ్చి భార్యాభర్తలను పొట్టన పెట్టుకుంది.

ఆ ప్రమాదం వరంగల్ అర్బజన్ జిల్లా రాంపూర్ హైవైపై జరిగింది. కారు అతి వేగంతో దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న దంపతులను ఢీకొట్టింది. కారు వేగానికి జంటగా నడుస్తున్న వారు ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. 

వారిని పొట్టన పెట్టుకున్న కారు ఆగకుండా ముందుకు దూసుకుపోయింది. కారు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు ఆ కారు కోసం గాలిస్తున్నారు. ప్రాణాలు విడిచిన భార్యాభర్తలను ఐలయ్య, వెంకటమ్మలుగా గుర్తించారు.