విశాఖపట్నం జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఆడపిల్లను కనిందనే కోపంతో భార్యను చంపడానికి ప్రయత్నించాడు. నీళ్లలో యాసిడ్ కలిపి ఇచ్చాడు.

విశాఖపట్నం: ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో భార్యను కడతేర్చేందుకు ప్రయత్నించాడు భర్త. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలపాలెంలో చోటుచేసుకుంది. 2016లో అపర్ణ అనే మహిళను గంగు నాయుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇటీవల అపర్ణకు ఆడపిల్ల పుట్టడంతో గంగు నాయుడు సహించలేకపోయాడు. ఈ కారణంతో గత కొంత కాలంగా భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌ 20 తేదీన నీళ్లలో యాసిడ్‌ కలిపి ఇచ్చాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. 

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి పథకం ప్రకారం భార్యను చంపేందుకు గంగు నాయుడు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులతో కలిసి అపర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.