Viral video: ఓరి దేవుడో..! భూమి మీద నూకలున్నాయంటే ఇదేనేమో..!!

Viral video: నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వాళ్లంతా అమ్మ బాబోయ్.. చాలా సైలెంట్ గా ఉండే గంగిరెద్దు ఇంతపని చేసిందా? రెప్పపాటు క్షణంలో మయరాజుకు హాయ్ చెప్పి వచ్చాడ్రా బాబూ.. ఏంటీ ఆ వీడియో అనుకుంటున్నారా.. అయితే.. మీ కూడా ఓ లూక్కేయండి. 
 

Bull Jumps On Scooter In Bengaluru, Rider Narrowly Escapes Death Viral video KRJ

Viral video: ఇటీవల మనుషులపై జంతువులు దాడులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా వీధి కుక్కలు, కోతులు, ఏనుగులు, అప్పుడప్పుడు చిరుతలు దాడులు చేసిన సంఘటనలు చూసే ఉంటాం. అలాంటి వార్తలు చదివే ఉంటాం.  కానీ, ఇటీవల ఆవులు, ఎద్దులు సైతం మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి.  తీవ్రంగా గాయపరిచి, ప్రాణాలు కూడా తీసున్నాయి. తాజాగా  తాజాగా బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిపై అప్పటి దాకా నెమ్మదిగా వెళ్తున్న ఓ గంగిరెద్దు సడెన్ రెచ్చిపోయి.. ఆకస్మాత్తుగా దాడికి తెగబడింది. ఇప్పుడూ ఈ దాడికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.  

వివరాల్లోకి వెళ్లే.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహాలక్ష్మి లేఅవుట్ లో మధ్యాహ్నం వేళ ఓ వ్యక్తి తన బైక్ పై నెమ్మదిగా వెళ్తున్నారు. ఈ సమయంలో అతనికి ఎదురుగా ఎదురుగా ఓ గంగిరెద్దు వస్తుంది. అప్పటిదాకా సైలెంట్ గా నెమ్మదిగా ఉన్న గంగిరెద్దు ఒక్కసారిగా వైలెంట్ గా మారింది. ఎందుకో తెలియదు అమాంతం రెచ్చిపోయి.. ఎదురుగా వస్తున్నా  బైక్ పై వస్తున్నా వ్యక్తి మీదకొచ్చి పొడిచేసింది.

దీంతో ఆ వ్యక్తి.. అటుగా వెళ్తున్న లారీ కింద పడిపోయాడు. అయితే.. సకాలంలో ఆ లారీ డ్రైవర్ స్పందించడంతో ఆ వ్యక్తి బతికి బయటపడ్డారు. నిజంగా అద్రుష్టమంటే ఇదేనేమో.. ఆ లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. బ్రేక్ వేశాడు. కాబట్టి ఎలాంటి ప్రాణాహాని జరగకుండా బయటపడ్డాడు. కొందరు ఆ ట్రక్కు డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆ డ్రైవర్ వెంటనే స్పందించి బ్రేకులు వేసి ఉండకపోతే.. బాధితుడిపై నుంచి వెళ్లిపోయేదని చెప్పారు. అదృష్టం అంటే ఇదే అని కొందరు అన్నారు.ఇందుకు  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios