విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. శ్మశాన వాటికకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై మండిపడ్డారు.  శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా? అంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. 

శ్మశాన వాటిక గోడలకు వైసీపీకి చెందిన రంగులు వేస్తారా అంటూ నిలదీశారు. శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా?...అంటూ నిలదీశారు. శ్మశాన వాటిక గోడలకు వైసీపీ రంగులా? పల్నాడులో శ్మశానం గోడకు, చిన్న గదికి, ఆర్చ్‌కు కూడా వైసీపీ రంగులు వేస్తారా?...దేన్నీ మీరు వదలరా?’’ అని నాని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రంగులు వేసిన శ్మశాన వాటికకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని.