విజయవాడ: భర్త చేతిలో మోసపోయిన ఓ మహిళ పిల్లలతో పాటు రోడడున పడింది. కృష్ణా జిల్లా విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో భర్త చేతిలో మహిళ మోసపోయింది. గత వార రోజులుగా ఆమె పిల్లలతో పాటు విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలోని మసీదు ముందు బైఠాయించి నిరసన తెలుపుతోంది.

తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె పోరాటం చేస్తోంది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన న్యాయం జరిగేలా చూడాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరింది.