అమరావతి: ఆంధ్ర  ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని దేవాలయాలన్ని తెరుచుకోవడంతో దైవదర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టికి వుంచుకుని దేవాదాయ శాఖ కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. 

వీడియో

"

 ఇవాళ(శుక్రవారం) విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తుల ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దీంతో ఆలయ అధికారులు మరింత జాగ్రత్త వహించి వారు సామాజిక దూరం పాటించే ఏర్పాట్లు చేశారు. మాస్కు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అనారోగ్యంతో బాధపడేవారు దర్శనం కోసం రాకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. అయితే భక్తులు కూడా అధికారులకు సహకరిస్తూ అమ్మవారికి దర్శించుకుంటున్నారు.