విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాను పనిచేస్తున్న డ్యాన్స్ ట్రూప్ లోని సునీల్ అలియాస్ బన్నీతో వివాహేతర సంబంధమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. తన అక్రమ సంబంధం గురించి భర్త సతీష్ కు ఏం చెప్పాలో తెలియక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 

సతీష్ ను గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. స్వతహాగా బ్యాంకర్ అయిన గాయత్రి వివిధ వేడుకల్లో ప్రదర్శనలు కూడా ఇస్తూ వస్తోంది. బన్నీ బృందంలో ఆమె పనిచేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు బన్నీతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఆ విషయం బన్నీ భార్య నీలిమకు తెలిసింది. నీలిమ ఇంటికి వచ్చి నిలదీసింది. నీలిమతో గొడవ పడుతున్న సమయంలో భర్తను, పిల్లలను ఆమె బయటకు పంపినట్లు తెలుస్తోంది. నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 

నీలిమను, ఆమె భర్త బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాయత్రి భర్త సతీష్ ను కూడా పోలీసులు విచారించారు. గాయత్రి ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గాయత్రి ఆత్మహత్య విషయంలో పోలీసులు వాట్సప్ మెసేజ్ లను, ఫోన్ కాల్స్ ను పరిశిలీస్తున్నారు.

గాయత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులే తేల్చాలని నీలిమ చెప్పిన విషయం కూడా తెలిసిందే. తన భర్తకు దూరంగా ఉండాలని తాను గతంలోనే గాయత్రికి చెప్పానని, అందుకు ఆమె అంగీకరించిందని కూడా చెప్పింది.