హంసవాహనం 40 నిమిషాల పాటు ఒక రౌండ్ పూర్తి చేసుకుంది. తెప్పోత్సవానికి దాదాపు 400మందితో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. హంసవాహనంపై కేవలం 32మంది మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ వేసుకోవాలని అధికారులు తెలిపారు. అన్ని డిపార్ట్ మెంట్లకి సంబంధించిన అధికారులతో ఇప్పటికే హంస వాహనంపై ట్రైల్ రౌండ్ నిర్వహించినట్లు చెప్పారు.
దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి దుర్గమ్మ తెప్పోత్సవానికి రెండంచెల భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెప్పోత్సవంపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించారు. తెప్పోత్సవానికి ఉపయోగించే బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టిన తర్వాతే తెప్పోత్సవం నిర్వహించారు.
హంసవాహనం 40 నిమిషాల పాటు ఒక రౌండ్ పూర్తి చేసుకుంది. తెప్పోత్సవానికి దాదాపు 400మందితో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. హంసవాహనంపై కేవలం 32మంది మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ వేసుకోవాలని అధికారులు తెలిపారు. అన్ని డిపార్ట్ మెంట్లకి సంబంధించిన అధికారులతో ఇప్పటికే హంస వాహనంపై ట్రైల్ రౌండ్ నిర్వహించినట్లు చెప్పారు.
హంసవాహన ఊరేగింపులో బానాసంచా కాల్చకూడదనే నిబంధనను అధికారులు అమలు చేశారు. పాసులు ఉన్నవాళ్లకే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వాహనంతోపాటు 4ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వెంట ఉంచుతున్నట్లు వివరించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 8, 2019, 9:37 AM IST