ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య... ఏపిలోనూ ఇదే పరిస్థితి..: పంచుమర్తి అనురాధ
హైదరాబాద్ శివారులో కామాంధుల చేతిలో ఘోరంగా అత్యాచారానికి గురై హత్య గావించబడ్డ ప్రియాంక రెడ్డికి టిడిపి తరపున సంతాపం, పుట్టెడు దు:ఖంలో వున్న కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు పంచుమర్తి అనురాధ ప్రకటించారు.
విజయవాడ: కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆవేధన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులో శంషాబాద్ ప్రాంతంలో కామాంధుల కాటుకు బలయిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు టిడిపి తరపున సంతాపం, సానుభూతి తెలియచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేక మంది యువతులు, చిన్నారులు అత్యాచారాలకు గురైనా ఈ దారుణాలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇటువంటి దారుణాలపై సీఎం జగన్ స్పందించి చర్యలకు ఆదేశించాలని కోరారు.
ఏపిలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులలో ఎక్కువ శాతం వైసిపికి అనుకూలంగా ఉన్నవారే ముద్దాయిలుగా వుంటున్నారని ఆరోపించారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్నా బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదని... కనీసం ఈ దారుణాలపై కూడా వెంటనే స్పందించడం లేదని అన్నారు.
read more షాద్‌నగర్ పీఎస్ వద్ద హైటెన్షన్: నిందితుల తరలింపు, జనంపై లాఠీఛార్జీ
గతంలో ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే బాధిత చిన్నారికి సాయం అందించాలని టిడిపి భావించిందని...కానీ దీనివల్ల తమకు ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న భావనతో ప్రభుత్వం ఆ అమ్మాయిని ఆస్పత్రి నుంచి బలవంతంగా మార్చారని గుర్తుచేశారు.
అభం శుభం తెలియని వయసులో అత్యాచారం జరిగాక బాలిక మానసికంగా కృంగిపోయిందని... ఎవరిని చూసినా భయపడిపోయిందన్నారు. ఇదే ఆసుపత్రిలో పుట్టిన అమ్మాయిని ఇప్పుడు ఇలా చూడటం బాధగా వుందని వైద్యం చేసిన డాక్టర్లు సైతం కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన వైసిపి నేత కాసు మహేంద్ర రెడ్డి అనుచరులు నరేంద్ర రెడ్డి ఈ ఘటనలో నిందితుడని ఆరోపించారు. ఇప్పటివరకు వాళ్లపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదని అనురాధ అన్నారు.
JusticeForPriyankaReddy : నిందితులను బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి