కోడెల మాదిరిగానే చింతమనేని అంతమెుందించాలని కుట్ర : వర్ల రామయ్య
కోడెల మాదిరిగా చింతమనేనిని వేధించాలని ప్రభుత్వం చూస్తోందంటూ ధ్వజమెత్తారు. చింతమనేనిని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని చింతమనేని హక్కులను కాపాడాలని కోరారు.
ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వైసీపీ ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోందని ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఎలా అయితే వేధించారో చింతమనేనిని కూడా అలానే వేధిస్తున్నారని ఆరోపించారు.
కోడెల మాదిరిగా చింతమనేనిని వేధించాలని ప్రభుత్వం చూస్తోందంటూ ధ్వజమెత్తారు. చింతమనేనిని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని చింతమనేని హక్కులను కాపాడాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ, కలెక్టర్ పక్షపాత ధోరణి అవలంభించడం అన్యాయమని వర్ల రామయ్య ఆరోపించారు. చింతమనేని పట్ల జిల్లా వైసీపీ నేతలు మరియు అధికార యంత్రాంగం అమానుషంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ అధికారులకు, వైసీపీ నేతలకు మధ్య ఒప్పందం జరిగిందని అందువల్లే చింతమనేనిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చింతమనేని తన హక్కులను కోల్పోయే విధంగా వైసీపీ వాళ్లు వ్యవహరిస్తున్నారని అది చాలా దారుణమని ఆరోపించారు.
జిల్లా అధికార యంత్రాంగం చింతమనేని విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఇప్పటికైనా మార్పు రాకపోతే ఉద్యమబాట పట్టాల్సి వస్తోందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వర్ల రామయ్య.
ఈ వార్తలు కూడా చదవండి
చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు...
చింతమనేని అరెస్ట్ లో మరో ట్విస్ట్, మరోకరు అరెస్ట్
ఏలూరు కోర్టుకు చింతమనేని ప్రభాకర్: ఈనెల 25 వరకు రిమాండ్
రెచ్చగొట్టారు, నాది తప్పని నిరూపిస్తే... బొత్సకు చింతమనేని సవాల్...
అజ్ఞాతం వీడిన చింతమనేని: భార్యను చూసేందుకు వెళ్తుండగా అరెస్ట్...