టీడీపీ ఎంపీ కేశినేని నాని విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ మీద పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఆయన పనులను పర్యవేక్షించారు. గడ్కరీ దాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

విజయవాడ: విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తూ ఆయన ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తి కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దీంతో బెజవాడ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ఆయన అన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో దాని నిర్మాణం పూర్తయిందని ఆయన అన్నారు. వచ్చే నెల 4వ తేదీన కేంద్ర మంత్రి గడ్కరీ దాన్ని ప్రారంభిస్తారని కేశినేని నాని చెప్పారు. 

వీడియో చూడండి

"