అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  పేర్కొన్నారు. అయితే బిజెపి నాయకుల కాళ్లు పట్టుకుని మరీ ఎన్డీఏలో చేరడానికి రాష్ట్ర ప్రయోజనాలు కారణం కాదని కేవలం ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత విషయాలే కారణమన్నారు. ముఖ్యంగా తనపై వున్న కేసుల నుండి తప్పించుకోడానికి జగన్ ఈ పని చేస్తున్నారని బుద్దా ఆరోపించారు. 

''బొత్స గారు చెప్పారంటే వైకాపాలో వేదవాక్కే... అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్టు మొదట మాట్లాడింది బొత్స గారే... ఇప్పుడు వైకాపా ఎన్డీయే లో కలవబోతుంది అని బొత్స చెప్పారు'' అని అన్నారు. కాబట్టి వైసిపి ఎన్డీఏలో చేరడం  ఖాయంగా కనిపిస్తోంది. 

read more  మేం గుజరాత్ తో పోటీపడ్డాం... అందువల్లే...: చంద్రబాబు నాయుడు

''అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం అన్న వైఎస్ జగన్ గారు ఇప్పుడు కేంద్రం ముందు ఎందుకు మోకరిల్లారో బొత్స గారు సమాధానం చెప్పాలి'' అని బుద్దా నిలదీశారు.
 
''కేసుల మాఫీ కోసమా? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండేందుకు ఎన్డీయే తీర్థం పుచ్చుకుంటున్నారా? దేని కోసం ఎన్డీయే లో చేరుతున్నారో? తల వంచి, కాళ్లు పట్టుకొని ఎన్డీయే లో చేరి సాధించబోయేది ఏంటో బొత్స గారు వివరించాలి'' అని బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.