ఇసుక కృత్రిమ కొరతపై వైసిపి గుట్టు రట్టు... ఆధారాలివే..: లోకేశ్

ఆంధ్ర ప్రభుత్వం కేవలం తమ పార్టీ నాయకుల స్వప్రయోజనం ఇసుక కొరతను సృష్టించిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు నారా లోకేశ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద వున్నాయని ఆయన పేర్కొన్నారు. 

tdp leader nara lokesh fires on ysrcp government on sand shortage

గుంటూరు:  టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక ధర1400 రూపాయలకే వచ్చిందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గుర్తుచేశారు. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన కేవలం ఆరునేల్లోనే ట్రాక్టర్ ఇసుక ఆరు వేలకు పెంచేసారని... ఇదేనా అవినీతి లేని కొత్త విధానం అని  సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ లోకేశ్ కామెంట్ చేశారు.

పొన్నూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ ఇసుక  కొరతపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం లారీ ఇసుక 40 వేల నుండి 70 వేలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత వలన 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటంలేదని...వారి ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. ఎ మంత్రి అయితే ఏకంగా పోలీసులే అక్రమ ఇసుక రవాణా ప్రోత్సహిస్తున్నారని అని మాట్లాడుతున్నారు.

read more  పొలిటికల్ కరెప్షన్ ఓకే... వారి అవినీతే తగ్గాలి...: మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం దేశంలొనే ఇదే ప్రథమమని అన్నారు. వైసిపి నాయకుల ప్రయోజనాల కోసమే ఇసుక కొరత సృష్టించారని... వరదలున్న ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత మన రాష్ట్రంలోనే ఎందుకుందని ప్రశ్నించారు.

ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని... ఓవైపు వరద వలన ఇసుక లేదు అని చెబుతూనే మరోవైపు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ కి ఇసుక తరలించి బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా వైసిపి ఇసుక మాఫియా గుట్టు రట్టు చేసామని.. 

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు అంటున్న ప్రభుత్వం ముందు వారి నాయకులు చేస్తున్న అక్రమ రవాణాని అడ్డుకోవాలని సూచించారు. ఇసుక కోసం వైసిపి నేతల మధ్య నెలకొన్న వివాదాలను ముఖ్యమంత్రే పరిష్కరిస్తున్నారని ఆరోపించారు. తాను దీక్ష చేస్తే డైటింగ్ దీక్ష అని విమర్శించారు.ఇసుక కొరత లేదని చేప్తూనే ఇసుక వారోత్సవాలు అంటున్నారని అన్నారు.

read more  స్టార్ట్-అప్ ఏరియా ప్రాజెక్ట్ సాధ్యం కాదు..:తేల్చేసిన ఆర్థిక మంత్రి

ఉపాధి కోల్పోయిన కార్మికులకు పదివేలు ఇవ్వాలని...చనిపోయిన కుటుంబానికి పాతిక లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఉచిత ఇసుక పాలసీని తిరిగి  సుకురావాలని కోరారు. కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని లోకేశ్ ఆరోపించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios