సిబిఐ కోర్టుకు సీఎం... దృష్టి మరల్చడానికే ఆ కుట్ర: దేవినేని ఉమ

శుక్రవారం అమరావతి  ప్రాంతంలో హింస సృష్టించింది ముఖ్యమంత్రి జగనేనని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. 

tdp leader devineni uma fires on ap cm ys jagan

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పు పేరుతో రాష్ట్రంలో అలజడికి కారణమైన ముఖ్యమంత్రి జగన్ పై మరిన్ని కుట్రలకు తెరతీశారని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. శుక్రవారం సీఎం హోదాలో సిబిఐ కోర్టులో హాజరైన ఆయన ఈ వార్త నుండి ప్రజల దృష్టి మరల్చడానికే రాజధాని ప్రాంతంలో హింస సృష్టించాడని ఆరోపించారు.  

చాలారోజులుగా అమరావతిలో నిరసనలు కొనసాగుతుండగా శుక్రవారం మాత్రమే రైతులు, మహిళలపై పోలీసుల లాఠీచార్జీలు, అరెస్టులు చేయడం వెనుకున్న రహస్యమిదేనని తెలిపారు. కేవలం తాను సిబిఐ కోర్టులో హాజరైన విషయం పెద్దవార్తగా ప్రచారం  కాకుండా వుండేందుకే సీఎం జగన్ పోలీసులను ఉపయోగించి రాజధాని ప్రాంతంలో హింస సృష్టించారని ఆరోపించారు. 

read more  మూడు రాజధానుల వెనకున్న రహస్యమిదే: నాదెండ్ల

జగన్ మాట వింటూ తప్పుల మీద తప్పులు చేస్తున్న అధికారులు భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాలం ఎప్పటికీ ఒకేలాగ వుండదని గుర్తించి అధికారులు నిజాయిలతీగా తమ విధులు నిర్వర్తిస్తే మంచిదని సూచించారు. 

శుక్రవారం శాంతియుతంగా నిరసన  తెలుపుతున్న రైతులు, మహిళలపై దాడి  చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు అమలు చేస్తున్నారని... 144 సెక్షన్ అమలు చేయవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు సూచనలకే విలువివ్వకుండా జగన్ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా అమలుచేస్తున్నారని అన్నారు. 

read more  రాజధాని ఉద్యమంలో విషాదం...భూమినిచ్చిన రైతు హఠాన్మరణం

144 సెక్షన్‌ అడ్డం పెట్టుకుని తెలుగు దేశం పార్టీ  నాయకులను అక్రమంగా బంధించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం కోసం ఏర్పడిన జేఏసీ కార్యాలయానికి తాళం వేయడం నిరంకుశ దోరణికి నిదర్శనమన్నారు. అధికార వైసిపి అన్ని పార్టీలు ఈ జేఏసిలో వున్నాయని అన్నారు. రాజధాని వివాదంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్న ప్రభుత్వ  మాటలు ఉట్టివేనని తేలిందని... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని దేవినేని ఉమ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios