video: దేవినేని అవినాశ్ పార్టీ మార్పు.... కార్యకర్తల సమావేశం మెజార్టీ అభిప్రాయమిదే
ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి, కీలక నాయకుల పార్టీ మార్పులతో సతమతం అవుతున్న అతడికి షాకిచ్చేందుకు మరో కీలన నేత సిద్దమయ్యాడు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా యువ నాయకుడు, విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడు రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
నగరంలోని గుణదల ప్రాంతంలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో పాటు తన సన్నిహితులు, అనుచరులతో తెలుగు యువత అధ్యక్షులు అవినాశ్ సమావేశమయ్యారు. తన పార్టీ మార్పుపై వారి అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం.
వీడియో
ఈ సందర్భంగా ఎక్కువమందిఅధికార వైసిపి లో చేరాలనే అవినాశ్ కు సూచించినట్లు సమాచారం. టిడిపి అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి పనిచేసిన అవినాష్ కు తగిన న్యాయం పార్టీ లో జరగలేదని వారు అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని... వారికి తగిన సమాధానం చెప్పాలంటే పార్టీ మార్పే ఉత్తమమని వారు అవినాశ్ కు సూచించినట్లు తెలుస్తోంది.
read more ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: వైసిపీలోకి దేవినేని అవినాష్
మెజార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ మార్పుకే మద్దతిచ్చినట్లు సమాచారం. కొందరయితే పార్టీ మారాలని అవినాష్ పై తీవ్ర ఒత్తిడి కూడా తీసుకువచ్చారట. మనకు న్యాయం జరగని టీడీపీలో ఇక ఎంత కష్టపడి పనిచేసినా విలువ ఉండదని కార్యకర్తలు సూచించారట. ఎంతోమందికి రాజకీయ గురువు అయిన దేవినేని నెహ్రు కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం పై కార్యకర్తలు మండిపడినట్లు తెలుస్తోంది.
వీడియో
దేవినేని అవినాష్ గత కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి ఆయన ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉంది.
సాధారణ ఎన్నికల్లో ఆయన కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటికే శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేవినేని అవినాష్ కూడా పార్టీ నుంచి తప్పుకుంటే కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా విజయవాడలో టీడీపీ మరింత బలహీనపడుతుంది.
read more ఇసుక కృత్రిమ కొరతపై వైసిపి గుట్టు రట్టు... ఆధారాలివే..: లోకేశ్
కొంత కాలంగా అవినాష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్తాపానికి గురవుతున్నట్లు సమాచారం. గుడివాడలో కొడాలి నానిపై తనను బలవంతంగా పోటీ చేయించారని కూడా అంటున్నట్లు సమాచారం. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో తన కుటుంబానికి పట్టు ఉంటే గుడివాడ నుంచి పోటీ చేయించారని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.