ప్రజలే వైసిపి నాయకుల్ని పిచ్చికుక్కల్లా కొడతారు...ఆరోజు దగ్గర్లోనే: చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేస్తున్న  దాడులు, దౌర్జన్యాలను విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ కలిసి వివరించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  

TDP Chief Chandrabadu Complains ap Governor

విజయవాడ: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్ధలో నామినేషన్లు వేయనీకుండా అడ్డుకోవటం ఏంటని వైసీపీ తీరుపై మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ర్ట వ్యాప్తంగా  వైసీపీ శ్రేణులు చేస్తున్న  దాడులు, దౌర్జన్యాలను  విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ కలిసి వివరించారు. 

అనంతంరం చంద్రబాబు నాయుడు  మీడియాతో మాట్లాడుతూ..... ఎన్నికల నోటిపికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు.  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత  వైసీపీ  పార్టీ ఓడిపోతుందని తెలిసి రాజధాని అమరావతి, మరికొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరపకుండా నోటిపికేషన్ ఇచ్చారని అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా అనేక చోట్ల వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్దులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని నామినేషన్ పత్రాలు చింపివేయటం, బెదిరించటం, దాడులు  చేయటం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 

''రాష్టవ్యాప్తంగా 500 కుపైగా ఎంపీటీసీ స్ధానాలు, 12 జెడ్పీటీసీ స్ధానాలకు  టీడీపీ అభ్యర్దులు నామినేషన్ వేయలేని పరిస్ధితి.  మరికొన్ని చోట్ల అధికారులు పలు చిన్న చిన్న కారణాలు సాకుగా చూపి టీడీపీ అభ్యర్దుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు  ఎన్నికల సంఘానికి కూడా తెలియజేస్తున్నాం. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్  ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  పోలీసులే టీడీపీ అభ్యర్దులను  బెదిరిస్తున్నారు''అని ఆరోపించారు.

read more  ఆ మూడు వుంటేనే లోకేష్ అపాయింట్ మెంట్... చంద్రబాబు అయితే..: మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్

''పులివెందుల, పుంగనూరు, మాచర్ల వంటి నియోజకవర్గాల్లో  ఇతర పార్టీ  అభ్యర్దుల్ని నామినేషన్ వేయకుండా ఎంపీటీసీలు ఏక్రగీవం చేసుకున్నారు. ఇది పరాకాష్టకు నిదర్శనం. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, ఖూనీ చేస్తున్నారు. ప్రజలకు హక్కులను కాలరాస్తోంది.   ఎవరైనా మాట్లాడితే ఆర్థికంగా, భౌతికంగా దాడులు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు'' అని అన్నారు.

''నిన్న మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమా న్యాయవాది కిషోర్ పై దాడి చేశారు. ఈ విషయాలన్ని గవర్నర్ కి తెలియజేశాం.  వైసీపీ అరాచకాలపై గవర్నర్ స్పందించాలి.  రాష్ర్టంలో పరిపాలన లేదు, ప్రజలకు హక్కులు లేవు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ పోలీసు వ్యవస్ధ, న్యాయవ్యవస్ధ శాశ్వతం. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి.  పోలీసు  అధికారుల్ని కోర్టు కూడా తప్పు పట్టే పరిస్థితి వచ్చింది. వైసీపీ ఉన్మాదంపై మేం పోరాడుతాం. అందుకు ప్రజలు కూడా సహకరించి ఉన్మాదంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి'' అని సూచించారు.

''వైసీపీ శ్రేణులు కండకావరం, ఒళ్లు బరువెక్కి వ్యవహరిస్తున్నారు. ఇక వారి  ఆటలు సాగనివ్వం. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిసి దానిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బోండా ఉమ, బుద్దా వెంకన్న, న్యాయవాది కిషోర్ పై హత్యాయత్నం చేశారు. మాచర్లకు 10 కార్లలో వెళ్లారని సిగ్గు లేకుండా అబద్దాలు  చెబుతారా?  అబద్దాలు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?  మా నాయకులు కేవలం 3 కార్లలోనే  వారి గన్ మెన్లతో కలిసి  వెళ్లారు.  వైసీపీ శ్రేణలు రాష్ట్రాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఆంబోతుల్లా రోడ్లపై పడి ఇష్టానుసారం చేస్తారా?   ప్రజలు తిరగబడితే  మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్లు కొడతారు. ఆ రోజు ఎంతో దూరం లేదు'' అని  చంద్రబాబు హెచ్చరించారు. 

read more  జగన్ అవినీతిపై ఆ దేశాల్లో అధ్యయనాలు...: నిమ్మల సైటైర్లు

''రాష్ట్రం మీ జాగీరా?.. ప్రజలంటే అంత చులకనా?  మీ బాబాయ్ హత్యకు గురైతేనే దిక్కులేని పరిస్థితి. ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు. టీడీపీ నేతలు మాచర్ల వెళ్లకూడదా?  ఇది ఏమైనా పాకిస్థానా?..అక్కడకెళ్లేందుకు  వీసా కావాలా?  మాచర్ల మీ తాత జాగీరా?.. ఎవరూ వెళ్లకూడదా?    అన్యాయం జరిగితే మీ గుండెల్లో నిద్రపోతాం. రాజశేఖర్ రెడ్డి ని చూశాం, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూశాం, రౌడీయిజం చేస్తే అదే మీకు ఆఖరి రోజు. వైసీపీ నేతలకు పిచ్చి పట్టిందా?.. ఒళ్లు కొవ్వెక్కిందా. ధైర్యం ఉంటే నామినేషన్లు వేసి గెలవండి చూద్దాం'' అని వైసిపి నాయకులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios