విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అద్దేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిలోకి దూకాడు. దాంతో బ్యారేజీ నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయాడు. 

శ్రీనివాస్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. 

కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను బ్యారేజీ పైనుంచి కృష్ణానదిలోకి ఎందుకు దూకాడనే విషయం తెలియాల్సి ఉంది.