విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టూవీలర్ ని వేగంగా దూసుకువచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మృతుడి తలమీద నుండి టిప్పర్ దూసుకెళ్లడంతో గుర్తుపట్టడానికి వీలులేనంతగా చితికిపోయింది. 

ఈ ప్రమాదం తర్వాత లారీని ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. అయితే ఆపకుండా వెళ్లిన టిప్పర్ లారీని వెంబడించిన పోలీసులు కీసర టోల్ గేట్ వద్దకు రాగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వివరాలను సేకరించి అతడిపై కేసు నమోదు చేశారు. 

read more  భార్యపై అనుమానం... కన్న కొడుకునే కిరాతకంగా చంపిన కసాయి తండ్రి

ప్రస్తుతానికి మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి వద్ద లభించిన వస్తువుల ఆధారంగా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

నిన్న(శుక్రవారం) చిత్తూరు జిల్లాలో కూడా ఇలాగే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద వాహనాలపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అది ఆటో, మినీ వ్యాన్, బైక్‌పై దూసుకెళ్లింది.

దీంతో కంటైనర్ కింద నలిగిపోయి వీరు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే.. వీరందరూ గంగవరం మండలం మరి మా కుల పల్లె గ్రామానికి చెందిన వారు. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

read more  చిత్తూరు: వాహనాలపైకి దూసుకెళ్లిన కంటైనర్, 12 మంది దుర్మరణం

ఈ ఘటనలో ఆటో, టూ వీలర్, వ్యాన్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.