విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో ఈదురుగాలులతో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో విమానాల ల్యాండింగ్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే వాతావరణం లేకపోవడంతో విమనాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

హైద్రాబాద్ నుండి విజయవాడకు  ఓ ప్రైవేట్ విమానం మంగళవారం నాడు గాల్లోనే చక్కర్లు కొట్టింది.ఈ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఉన్నారు.మంగళవారం నాడు హైద్రాబాద్- విజయవాడ వెళ్లే విమానం  గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యే వాతావరణ పరిస్థితులు లేని కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టింది.

హైద్రాబాద్- విజయవాడకు వెళ్లే విమానం ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే విమానంలో హైద్రాబాద్ నుండి విజయవాడకు వైఎస్ విజయమ్మ  బయలుదేరారు.