రైతు భరోసా పథక లబ్దిదారుల జాబితాలో ప్రముఖులు.. మా పేర్లు తొలగించండి అంటూ
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామ జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. ఖాతా నెంబరు 371లో బలరామకృష్ణమూర్తి, ఖాతా నెంబరు 373లో కరణం వెంకటేష్ పేర్లు ప్రచురించారు. విషయం తెలుసుకున్న కరణం బలరాం జాబితా నుంచి వెంటనే తమ పేర్లు తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాల్లో ప్రముఖుల పేర్లు కనిపిస్తు న్నాయి. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేరు జాబితాలో కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ల పేర్లను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామ జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. ఖాతా నెంబరు 371లో బలరామకృష్ణమూర్తి, ఖాతా నెంబరు 373లో కరణం వెంకటేష్ పేర్లు ప్రచురించారు. విషయం తెలుసుకున్న కరణం బలరాం జాబితా నుంచి వెంటనే తమ పేర్లు తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఆయన కుమారుడు కరణం వెంకటేష్ సోమవారం ఒంగోలులో కలెక్టర్ పోలా భాస్కర్‌ను కలిసి తమ పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.సాంకేతిక సమస్యలతో ఈ పొరపాటు జరిగిందని, వెంటనే తొలగిస్తామని కలెక్టర్ చెప్పినట్టు వెంకటేష్ తెలిపారు.
అలాగే, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి పేరును చిత్తూరు జిల్లా కలికిరి మండలం పత్తేగడ గ్రామ రైతుభరోసా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు.
ఇది అధికార పార్టీ నాయకుల కుట్రగా కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లి తన పేరు తొలగింపజేయించానని సోమవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. తనపేరు జాబితాలో ఎలా చేరిందో ప్రభుత్వమే నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.