తాడేపల్లి: విజయవాడకు చెందిన ఓ యువకుడిని తాడేపల్లికి చెందిన రౌడీషీటర్లు కిడ్నాప్ చేశారు. యువకుడిని హింసించి,కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కిడ్నాప్ గ్ాయంగ్ 5 లక్షలు డిమాండ్  చేసింది. తాము అడిగినంత నగదు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపి కృష్ణానదిలో పడేస్తాం అంటూ బెదిరించారు.

దిక్కుతోచని స్థితిలో యువకుని కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 30 నిమిషాల్లో కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 

సిఐ అంకమ్మరావు బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాప్ గ్యాంగ్ లో ఓ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. హైసెక్యూరూటి జోన్ లో ఉన్న ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటన జరగడం కాస్తా కలవరానికి గురి చేస్తోంది. 

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రౌడీ షీటర్ల కదలికలపై  నిఘా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.