విజయవాడ లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి చిట్టూరి మురళి  తండ్రి మరణించటం  వలన కుటుంబ భారం తనమీద పడటం తో పగలు కాలేజ్ కి వెళ్లి చదువుకుంటూ  రాత్రి పూట టీ స్టాల్ నడుపుతూ కష్టపడుతున్నాడు. తన అక్క, చెల్లెలు పెళ్లి చేసిన మురళి. రాత్రి పూట తన తల్లి ని తోడుగా తీసుకుని టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండే మనస్తత్వం ఉన్న మురళి  గత కొంత కాలం గా SI నారాయణమ్మ నుంచి వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు ఎక్కువవడం తో గన్నవరం లోని కోనాయి చెరువు లో దూకి బలవన్మరణం చెందాడు. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ పోలీసులును రకరకాలుగా చర్చించుకుంటున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మురళీ మరణంపై విచారణ జరుపుతున్నారు. 

read also: బాలుడి హత్య: తల్లిపై అనుమానాలు, అక్రమ సంబంధం బయటపడుతుందని...?

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. చెల్లెలితో ఆడుకుంటున్న ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. అతన్ని ఉరేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. బాలుడి మెడపై గాయాలు తాడుతో ఉరివేసినట్లు గాయాలుండడంతో ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడి మరణంపై పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో తల్లిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్ల్ి మండలం ధర్మారం (బీ) గ్రామంలో ఆదివారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో జన్నెపల్లి అశోక్, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు .పెద్ద కుమారుడు నాగరాజు పిట్లంలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు రాజేశ్, కూతురు ధనలక్ష్మి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. 

బాలుడి మెడపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో తరుచుగా గొడవ పెట్టుకునే ఇద్దరు మహిళలు రాజేష్ కు చాక్లెట్లు ఇచ్చి గొంతు నులిమి చంపారని తల్లి సునీత పోలీసులకు చెప్పింది. రాజేశ్ కు పాము కాటు వేసిందని, త్వరగా రావాలని భార్య సునీత తనకు ఫోన్ చేసిందని, దాంతో తాను ఇంటికి వచ్చానని భర్త అశోక్ చెబుతున్నాడు. 

13 ఏళ్ళ బాలుడు.. 6 ఏళ్ళ బాలిక.. రైస్ మిల్ దగ్గరకు తీసుకెళ్ళి

కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడానికి సునీత అంగీకరించలేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చింది. దాంతో రాజేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివాహేతర సంబందాలకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని, ఉరి వేసి చంపి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇంట్లోంచి పగిలిన గాజులను, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.